Advertisement
రష్మిక, పూజా హెగ్డే & కీర్తి సురేష్ వంటి టాప్ మోస్ట్ సౌత్ ఇండియన్ హీరోయిన్లు 2022 సంవత్సరాన్ని దున్నేశారనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు సౌత్ & బాలీవుడ్‌లో తమ సినిమాలతో పాలించారు ఈ భామలు. మరోవైపు సమంత, నయనతార వంటి సీనియర్ హీరోయిన్లు తమిళం & తెలుగులో చేతినిండా సినిమాలతో వారికి పోటీ ఇచ్చారు. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, వర్ష బొల్లమా, నివేదా థామస్ & నివేదా పేతురాజ్ వంటి టైర్ 2 హీరోయిన్లు 2022లో భారీ రెమ్యునరేషన్‌లు అందుకున్న జాబితాలో చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే, ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Mahesh Babu and Ntr: మహేష్, ఎన్టీఆర్ ఇద్దరి జీవితాల్లో ఉన్న కామన్ పాయింట్స్ !
జయసుధ
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చిత్ర సీమను ఏలిన నటీమణులలో ఆమె ఒకరు. సహజనటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అయితే జయసుధ 20 రోజుల షూటింగ్ కోసం దాదాపు 20 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ఉంటారట. అంటే ఒక్క రోజుకు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
Advertisement
నదియా
ఒకప్పుడు హీరోయిన్ గా తన అందం అభినయంతో ఆకట్టుకున్న నదియా.. ఇప్పుడు మాత్రం అత్త మరియు తల్లి పాత్రలో నటిస్తూ వస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె ఒక్క రోజుకు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.
Also Read: Tarakaratna: తారకరత్న కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలిందా ?
రమ్యకృష్ణ
ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ హీరోయిన్ గా రమ్యకృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా రమ్యకృష్ణ గుర్తింపు తెచ్చుకుంది. అయితే రమ్యకృష్ణ ఒక రోజుకు రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.
Advertisement