Advertisement
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత అన్ని భాషలలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి చోట కూడా భారీ కలెక్షన్లను రాబడుతుంది. కన్నడ నుంచి కే.జి.ఎఫ్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో కాంతారా కలెక్షన్లను రాబడుతోంది. హోంభలే ఫిలింస్ వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఈ నెల 15వ తేదీన గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు.
Advertisement
Read also: పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!
Advertisement
ఈ సినిమాని కన్నడలో చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెంటనే తెలివిగా ఆలోచించి, తెలుగు థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి వెంటనే రిలీజ్ చేశారు. నటునిగా – దర్శకునిగా రిషబ్ శెట్టి అందరికీ రీచ్ ఫార్ములాతో సినిమాను రూపొందించడంలో విజయాన్ని సాధించారు. ఇప్పటికే ఈ చిత్రం ఎంతో మంది సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలనును అందుకుంది. అడవిలో ఓ తెగవాళ్ళకు చెందిన ఆచారాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే వారి ఆచారాలతో పాటు కమర్షియల్ హంగులను అద్ది దర్శకుడు రిషబ్ శెట్టి కథను రాసుకున్నాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇదే కాన్సెప్ట్ తో గతంలో కూడా కన్నడలో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరే “పింగారా”.
ఈ సినిమాను కన్నడ మరియు తులు భాషల్లో రూపొందించారు. ఇప్పుడు వచ్చిన కాంతారా సినిమాతో పోలిస్తే పింగారా సినిమాని చాలా నిజాయితీగా రూపొందించారని చెప్పవచ్చు. కానీ కమర్షియల్ హంగులు లేని కారణంగా పింగార సినిమా హిట్ కాలేదు. ఈ చిత్రం విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా కేవలం ఫిలిం ఫెస్టివల్ కు మాత్రమే పరిమితం అయింది.