Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అనే పేరు నుండి దేశం దాటింది.. ప్రపంచ దేశాల్లో కూడా తెలుగోడి దమ్ము చూపించిన డైరెక్టర్ రాజమౌళి.. బాహుబలి 1 మరియు 2 సినిమాలతో ప్రపంచ దేశాల ఇండస్ట్రీ చూపు తెలుగు ఇండస్ట్రీ పై పడేలా చేశాడు.. తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అనే విధంగా తయారయింది. జక్కన్న ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి సీన్ కళ్లకు కట్టేలా రక్తికట్టించారు.. చిన్న అంశాన్ని కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాను తెరకెక్కించారు. కానీ బాహుబలి సినిమాని ప్రేక్షకులు ఎన్నిసార్లు చూసినా అందులో ఉన్న కొన్ని విషయాలను మాత్రం ఇప్పటికీ గుర్తించలేరు..మరీ ఆ సన్నివేశంలో ఉండే ఈ విషయాన్ని ఓ సారి చూద్దాం.
Advertisement
ALSO READ:అదిరిపోయే ఆలోచనతో కోట్లు గడిస్తున్న హీరోయిన్ కాజల్.. ఎలా అంటే..?
Advertisement
బాహుబలి 2 మూవీ లో అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడు గా ఎంపిక చేసే సమయంలో అలాగే బల్లాల దేవుడి రాజుగా పట్టాభిషేకం చేసే సన్నివేశంలో అతని సింహాసనానికి ముందు ఎందరో రాజులు మంత్రులు మరియు కుంతల రాజ్యం నుంచి వచ్చిన వారు కూడా ఆసీనులై కనబడతారు. అందులో ముఖ్యంగా కుడివైపున వారి ఆసనాల పై గొడుగు వంటి నిర్మాణాలు ఉంటాయి. కానీ ఎడమ వైపు కూర్చునేటువంటి వారిపై ఎలాంటి నిర్మాణాలు లేకపోవడం మన క్లియర్ గా గమనించవచ్చు.. ఇందులో కుడి వైపున మాహిష్మతి రాజ్యానికి చెందినవారు కూర్చుంటారు, ఎడమ వైపు దేవసేన రాజ్యానికి చెందిన వారు ఆసీనులై కనబడతారు.. ఈ చిన్న సన్నివేశం ద్వారా దర్శకుడు బల్లాల దేవుడి పక్షపాత ధోరణి చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా అమరేంద్ర బాహుబలి కొడుకు అయినా మహేంద్ర బాహుబలి ఆ యొక్క బల్లాల దేవుడిని ఓడించి తన పట్టాభిషేకం జరిగే టైంలో అతనికి ఎదురుగా రెండు దిక్కులా కూర్చున్న వారిపై గొడుగులు ఉండటం గమనించవచ్చు. కానీ బల్లాల దేవుడి పాలనలో మాత్రం సామ్రాజ్యంలో అసూయ, ద్వేషం, అసమానత లాంటివి నిండి ఉండగా, అలాగే బాహుబలి పాలన సమయంలో సమానత్వం, సానుభూతి,ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్నాయని దర్శకుడు ఆ రెండింటి మధ్య తేడాలు చూపించారు.. ఇలాంటి చిన్న విషయాలలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించడంలో రాజమౌళి కి సాటి ఎవరూ రారు అని చెప్పవచ్చు.
ALSO READ:మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎందుకు “28” రోజులు ఉంటుంది..?