Advertisement
దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకేక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం). మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ఇంతటి ఘనవిజయాన్ని సాధించడానికి మొదటి కారణం రాజమౌళి అయితే.. రెండవ కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో తారక్ నట విశ్వరూపం చూపారు.
Advertisement
Read also: ఇన్ని రోజులు ఉదయకిరణ్ విషయంలో తప్పు చిరంజీవిది అనుకున్నారు ? అసలు వాస్తవం ఏంటంటే ?
ఓలీవియా మోరిస్, ఆలియా భట్, శ్రియ, అజయ్ దేవగన్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలలో నటించి మెప్పించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రానికి కీరవాణి స్వరపరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని రామ్ చరణ్ – తారక్ మధ్య సాగే దోస్తీ పాటకు అభిమానులు ఫిదా అయ్యారు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్లో కనిపించిన తీరు అందరినీ ఆకర్షించేలా చేసింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా.. కాలభైరవ ఆలాపించారు.
Advertisement
అయితే ఈ పాటలోని ఓ సీన్ లో కొమరం భీం పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మాంసం తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే నిలుచున్న రామరాజు, అలాగే రామరాజు బాబాయ్ భీమ్ ని చూస్తాడు. భీమ్ మాంసం తీసుకువెళ్లి లోపల ఉన్న రాహుల్ రామకృష్ణ కి ఇస్తాడు. అప్పుడు రాహుల్ రామకృష్ణ ఆ మాంసాన్ని ఒక రంద్రం లో నుంచి లోపలికి వేస్తాడు. అప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అది మనం సినిమా చూస్తున్నప్పుడు మొదటిసారి గమనించం. కానీ అప్పుడే పులి గాండ్రించే సౌండ్ వస్తుంది. అంటే అప్పటి నుండే ఆ జంతువులు అన్నిటికీ ఆహారం పెట్టి వాటిని దాడి కోసం తయారు చేస్తున్నాడు భీమ్. కానీ చాలామందికి మొదటిసారి ఈ సీన్ చూసినప్పుడు ఆ సన్నివేశం అర్ధం కాలేదు.
Read also: కట్టప్ప కూతురిని చూసారా ? అందంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువేమి కాదు !