Advertisement
ఏ బంధంలో అయినా స్నేహం, ప్రేమ ఉంటెనే ఆ బంధం సజావుగా సాగుతుంది. ఇక భార్యా భర్తల బంధంలో ప్రేమ కచ్చితంగా ఉండాలి. లేకుంటే ఆ బంధం పట్ల ఉన్న ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. మీ బంధంలో ప్రేమ తగ్గింది అని చెప్పడానికి మీకు కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మీ మధ్య గొడవలు జరిగితే పరవాలేదు. కానీ, ప్రతిసారి గొడవలు జరుగుతూ ఉంటె.. మీ మధ్య ప్రేమ తగ్గిందని అర్ధం చేసుకోవచ్చు. ఇక హ్యాపీ కపుల్ ఎల్లప్పుడూ మంచి లైం*గిక జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ ప్రేమ తగ్గడం వలన భార్య భర్తల మధ్య నెలల తరబడి లైం*గిక సంబంధం లేకుంటే మీ మధ్య ప్రేమ తగ్గిందనే అర్ధం.
Advertisement
వీటిని కూడా చదవండి : అయోధ్య రాముడికి మోడీ ఇచ్చిన ఈ కానుక ఏమిటో తెలుసా? ఇది ఎందుకు ఇచ్చారంటే?
Advertisement
మీ లైఫ్ పార్ట్ నర్ మీతో కాకుండా.. ఎక్కువగా ఇతరులతో లేదా తన ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే.. అప్పుడు కూడా మీ మధ్య ప్రేమ తగ్గిందని అర్ధం చేసుకోవచ్చు. ఇది మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడాన్ని కూడా సూచిస్తుంది. పార్టనర్స్ అంటే కష్ట సుఖాల్లో ఒకరినొకరు తోడుండటం. కష్ట సుఖాల్లో ఒకరినొకరు కచ్చితంగా తోడు ఉండాలి. కష్ట సమయాల్లో పార్టనర్ ని పట్టించుకోకుండా వదిలేస్తుంటే.. మీపై ప్రేమ తగ్గినట్లే.
వీటిని కూడా చదవండి : అదేంటండి అంత మాట అనేసారు ?? RRR లో ఎన్టీఆర్ గురించి ఇలా అన్నారు ఏంటి ?
తరచూ గొడవలు జరుగుతుండడం.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుండడం వలన కూడా ఇద్దరి ప్రేమ తగ్గిందని అర్ధం చేసుకోవచ్చు. సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటె కూడా ఇద్దరి మధ్యా దూరం పెరిగినట్లేనట. ఇందులో అందరికి అన్ని వాస్తవంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కోలా ఉంటాయి. దాన్ని బట్టి మీ ఇద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకుని మీ బంధాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి.
వీటిని కూడా చదవండి : పెళ్ళైన తరువాత అమ్మాయిలు బరువు ఎందుకు పెరుగుతారు? అసలు కారణం ఇదే!