Advertisement
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను.. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ చాలా వరకు కరెక్ట్ గా ఉంటుందని ఇండస్ట్రీలోని వాళ్లంతా భావిస్తూ ఉంటారు. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Advertisement
Read also: ఎవరూ చేయని త్యాగం చేస్తున్న ఇంద్రజ భర్త.. అదేంటో తెలుసా..?
Advertisement
ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నా అసలు పేరు వెంకట రమణారెడ్డి. మా అమ్మ నన్ను రాజు అని పిలిచేది. నైజాం ఏరియా కి డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల అందరూ నన్ను నైజాం రాజు అని పిలిచేవారు. దిల్ సినిమాతో నిర్మాతను కావడం, ఆ సినిమా హిట్ కావడంతో దిల్ రాజుగా పిలవడం మొదలైంది. ఈ 20 ఏళ్లలో 50 సినిమాలను నిర్మించడం జరిగింది. నాకు 47 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో నా భార్య చనిపోయింది. పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయినా నాకు భార్య చనిపోవడంతో భారీ షాక్ తగిలినట్లు అయింది. నేను ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఇంట్లోనే ఉండేవాడిని.
భార్యను కోల్పోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. రెండు సంవత్సరాల పాటు ఆ బాధను అనుభవించాను. భార్య మరణించాక రెండేళ్లు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరలేదు. అప్పుడు మళ్లీ నాకు పెళ్లి చేయాలని మా అమ్మానాన్న ఆలోచించారు. నా కూతురు కూడా అదే అనుకుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను ఆ దిశగా పుష్ చేశారు. ఆ సమయంలో వైఘా ను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. నా మొదటి భార్య అనిత, రెండవ భార్య వైఘా పేర్లు కలిసొచ్చేలా వాడికి “అన్వయ్” అని పేరు పెట్టుకున్నాం ” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!