Advertisement
దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో గొప్ప వేడుకగా మొదలయ్యాయి. భక్తులు కొన్ని పొరపాటు చేయకూడదు నవరాత్రుల సమయంలో భక్తులు చేసే పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదుర్కోవాలి. అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రులు జరుపుతారు. నవరాత్రుల్లో దుర్గమ్మ తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు మహిషాసురుని దుర్గాదేవి దశమి రోజున సంహరించింది. అందుకు గుర్తుగా విజయదశమిని మనం జరుపుకుంటుంటాం. రాముడు కూడా ఇదే రోజున రావణాసురుని సంహరించాడని చెప్తారు. పాండవులు కి తిరిగి రాజ్యం ఇదే రోజున లభించిందట. చెడుపై మంచి గెలిచిందని గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటాము. దసరా నేపథ్యంలో అమ్మవారి తొమ్మిది రోజుల్లో తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
Advertisement
Advertisement
తొమ్మిది రూపాల్లో కూడా పూజించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో దుర్గాదేవి నవరాత్రుల్లో కొన్ని పొరపాట్లు చేయకూడదు అవి ఏంటో పండితులు చెప్పారు. మరి వాటి గురించి ఇప్పుడు చూద్దాం.. ఈ పొరపాట్లు మీరు కూడా చేయకుండా చూసుకోండి. ముఖ్యంగా అమ్మవారి ఉపాసన తీసుకున్న వాళ్ళు మద్యానికి దూరంగా ఉండాలి. జూదం అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. అలాగే ఈ తొమ్మిది రోజులు మాంసాన్ని ముట్టుకోవడం కూడా మంచిది కాదు.
Also read:
ఉల్లి, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలి. నవరాత్రుల్లో చాలామంది ప్రత్యేకంగా ఉపవాసాలు చేస్తారు ఉపవాసం సమయం లో చెడు మాటలకు, చెడు వ్యాఖ్యలకి దూరంగా ఉండాలి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు ఇలా ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది. తొమ్మిది రోజులు కూడా తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అమ్మవారి అనుగ్రహం కలగదు ఇబ్బందులు ఎదుర్కోవాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!