Advertisement
శరన్నవరాత్రులప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. హిందూ సంప్రదాయంలో దేవతమూర్తులును ఆరాధించే సమయంలో జ్యోతిని వెలిగిస్తారు. ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను కూడా జరుపుతారు. నవరాత్రుల సమయంలో ఖచ్చితంగా అఖండ దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇలా వెలిగిస్తేనే తప్ప పారాయణం లేదా ఆరాధన పూర్తి కాదని అంటారు. శరన్నవరాత్రులు వేళ కూడా అఖండ దీపం వెలిగిస్తారు ఈ దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరన్నవరాత్రులప్పుడు అఖండ దీపం వెలిగించేటప్పుడు ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అఖండ దీపం ఎప్పుడూ కూడ వెలుగుతూనే ఉండాలి. ఆరిపోకుండా చూసుకోవాలి.
Advertisement
Advertisement
ముందుగా ఇత్తడి పళ్లెం తీసుకుని బియ్యం లేదా ధాన్యం పొయ్యాలి. పెద్ద సైజులో ఇత్తడి లేదా మట్టి ముకుడిని తీసుకోవాలి. తర్వాత మూకుడుని పళ్లెంలోని బియ్యం మీద ఉంచాలి. ఆ దీపానికి కుంకుమ బొట్లు పెట్టాలి పువ్వులతో అలంకరించాలి. మూకుడులో నూనె లేదా ఆవు నెయ్యి వేస్తే మంచిది. తర్వాత లావుపాటి వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. అక్కడి దీపం తొలగించాక దీపం దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. ఈ దీపం దగ్గర నైవేద్యం పెట్టాలి నైవేద్యంగా పేలాలు, బియ్యం, పట్టిక బెల్లం పెట్టొచ్చు.
Also read:
ఇంట్లో అమ్మవారి విగ్రహం ఫోటో దగ్గర ఈ దీపాన్ని పెట్టొచ్చు. ఆగ్నేయ మూలలో వెలిగిస్తే చాలా మంచిదట. అఖండ దీపంలో వత్తి వెలిగే దిక్కుని బట్టి ఫలితాలు ఉంటాయట. ఇంట్లో శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలన్న పెద్దల గౌరవం లభించాలన్న వత్తి తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అదే ఉత్తరం వైపు వెలిగిస్తే ధనపరంగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి అప్పులు తీరుతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!