Advertisement
సరిగ్గా విద్యుత్ ని ఆదా చేసుకోకపోతే కరెంట్ బిల్లు తడిసి మోపుడవుతుంది. కరెంట్ బిల్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా ఈరోజుల్లో పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు కొత్త మార్గంలో మోసాలు చేస్తున్నారు టెక్నికల్ గా ఉన్న అంశాలని తమకు అనుకూలంగా మార్చుకుని ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారు. ఇటీవల నార్కోటిక్ పోలీసుల్ని వర్షం ఇదే తరహాలో కరెంట్ బిల్లుల చెల్లింపుల పేరుతో మోసాలు చేస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుత్ బిల్లుని చెల్లించవచ్చని వాట్సాప్ ద్వారా ఏపీకే లింక్ పంపి ఆన్లైన్లో డబ్బులు దోచుకుంటున్నారు. గత కొంతకాలంగా చూసినట్లయితే ఫోన్ పే గూగుల్ పేమెంట్ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వినియోగించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
గత నెల నుంచి నిలిపివేశారు, కరెంట్ బిల్లు చెల్లించాలంటే ప్లే స్టోర్ నుంచి ఏపీ ఈపీడీసీఎల్ లేదా ఈస్టర్న్ పవర్ అని టైప్ చేస్తే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలా అక్కడి నుంచే యూపీఐ ఫోన్ పే గూగుల్ పే అనుసంధానంతో బిల్లును చెల్లించవచ్చు. విద్యుత్ బిల్లు చెల్లించడానికి ఎదురుచూస్తున్నారా అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి మాట కలిపి వాట్సాప్ నెంబర్ కి ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫీస్ పేరుతో ఉన్న ఓ నెంబర్ నుంచి ఒక ఏపీకే ఫైల్ ని మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.
Also read:
ఆ ఫైల్ ని ఇన్స్టాల్ చేసి వివరాలు నమోదు చేసి బిల్లు చెల్లించుకోవాలి అని చెప్తున్నారు. అలా చేస్తే నిమిషాల వ్యవధిలోనే మాల్వేర్ ఫోన్లోకి చేరుతోంది. వ్యక్తిగత సమాచారంతో పాటుగా బ్యాంకు వివరాలు ఫోన్ నెంబర్లు ఇలా ప్రతి సమాచారాన్ని కేటుగాళ్లు దోచుకుంటున్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా నమ్మారంటే ఖాతా ఖాళి అయిపోతుంది,
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!