Advertisement
ఫ్లైట్ లో వెళ్తే సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. కొద్ది గంటల్లోనే మనం మన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. కాస్త ధర ఎక్కువైనా కూడా సులభంగా మనం మన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. అయితే విమానాల్లో వెళ్లేటప్పుడు కొన్ని వస్తువుల్ని అసలు తీసుకెళ్లకూడదు. ఒకవేళ కనుక అటువంటి వస్తువులని మీరు విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో మీ లగేజీతో తీసుకువెళ్తే కచ్చితంగా ప్రయాణం చేయకుండానే మీరు వెనక్కి రావాల్సిన పరిస్థితి కలుగుతుంది మనం ఫ్లైట్లో వెళ్లేటప్పుడు మన వస్తువులని విమానాశ్రయంలో చెక్ చేస్తారు. కొన్ని వస్తువులని అస్సలు అనుమతించరు.
Advertisement
Advertisement
పవర్ బ్యాంకులు, డ్రై సెల్ బ్యాటరీలు, కత్తులు, కత్తెరలు వంటి పదునైన పరికరాలని అనుమతించరు. బొమ్మ తుపాకీలని, స్విచ్ ఆఫ్ చేయని ఎలక్ట్రానిక్ పరికరాలు, మందుగుండు సామాగ్రి వంటివి తీసుకెళ్లడం చట్టం ప్రకారం భద్రత ముప్పుగా పరిగణించబడింది. కనుక ఇటువంటి వస్తువులని మీరు ఫ్లైట్ జర్నీ చేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళకండి. పవర్ బ్యాంకులలో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి వీటిని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రాణాంతకంగా పరిగణిస్తుంది. కాబట్టి ఈ పొరపాటు చేయకండి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం రోజు 25000 నిషేదిత వస్తువులు విమానాశ్రయంలో తనిఖీల సమయంలో ప్రయాణికుల నుండి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also read: