Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా చిరంజీవి తెచ్చుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో చేసిన మాస్ సినిమాలు ఇప్పటికీ కూడా టివిలో వస్తే చూస్తూనే ఉంటారు. ఇప్పటికీ ఈ సినిమాలను ఎలాంటి బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తూనే ఉంటాం. ఇక అన్నయ్య అంటూ.. ఆయనపై చాలా అభిమానాన్ని పెంచేసుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఒకప్పుడు చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలనే నమ్ముకున్నారు. కొన్నిసార్లు పరాభవాన్ని కూడా ఫేస్ చేసారు కూడా.
Advertisement
Advertisement
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడా అంటూ సినీ విమర్శకులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ అన్నీ రీమేక్స్ నే ఎంచుకుంటున్నారు. దీని వలన ఆయన మార్కెట్ విలువ పడిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఓ జి సినిమా సక్సెస్ అయితే.. ఆయన మార్కెట్ వేల్యూ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 2013 లో అత్తారింటికి దారేది సినిమా తరువాత ఆయనకు భారీ స్థాయిలో హిట్ అయితే పడలేదు. రీమేక్స్ కాకుండా.. ఓ సాలిడ్ హిట్ పడాల్సి ఉంది.
అలా పడకుంటే మాత్రం ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఒకప్పటి చిరు బాటలోనే పవన్ కూడా నడుస్తున్నారని పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో రీమేక్స్ అంతగా అచ్చిరావడం లేదు. దీనికంటే స్ట్రెయిట్ సినిమాలు చేయడమే బెస్ట్ అని పలువురు భావిస్తున్నారు.