Advertisement
ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం ఎంతో బాగుంటుంది. చాలా మంది చాణక్య చెప్పిన సూత్రాలని పాటిస్తూ ఉంటారు. వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ఇప్పటికీ అలాగే వుంది. నేటికీ మన దేశంలో వ్యాపార రాజకీయ సైనిక రంగాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. అయితే వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో చాణక్య చెప్పారు. చాణక్య చెప్పిన సూత్రాలని మీరు కనుక ఫాలో అయ్యారంటే ఇక మీ వ్యాపారానికి తిరిగే ఉండదు. చాణక్యుడు అర్థశాస్త్రం నుండి మనం ప్రధానంగా వ్యూహాత్మక ఆలోచన విధానం అలాగే నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను నేర్చుకోవచ్చు.
Advertisement
వ్యాపార రంగంలో కచ్చితంగా ప్రణాళికతో ముందుకు వెళ్లాలంటే క్రమశిక్షణ అంకిత భావం ఉండాలని అర్థశాస్త్రం చెబుతోంది. వ్యాపారంలో ఉండే రిస్కును ముందుగా మదింపు చేసుకోవడానికి అనుగుణమైన చురుకైన నిర్ణయాలు తీసుకోవాలి అని చాణక్య అన్నారు. ఇప్పటి వ్యాపారాలకి కూడా ఈ చిట్కాలు పనిచేస్తాయి. వ్యూహాత్మక దూరదృష్టి వ్యాపారికి తప్పనిసరిగా ఉండాలని చాణక్య అన్నారు. వ్యాపారం విజయవంతంగా సాగాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి.
Advertisement
Also read:
సంస్థలో మెరుగైన పని వాతావరణం కల్పించుకోవడానికి వ్యాపారి చూసుకోవాలి. అలాగే వ్యాపారం చేసే వ్యక్తికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. వనరుల కేటాయింపు ఉత్పత్తి లక్ష్యం రాబడి ఇటువంటి వాటిపై అవగాహన ఉండాలి. అలాగే నేటి ప్రపంచం వేగంగా మారుతోంది. కాబట్టి వ్యూహాన్ని మార్చుకుంటూ ఉండాలని చాణక్య అర్థశాస్త్రంలో బోధించారు. అలాగే నైతిక వ్యాపార పద్ధతుల్ని పాటించాలని వ్యాపారులకి మంచి సూచనలు ఈ విధంగా చాణక్య ఇచ్చారు. ఇలా వ్యాపారులు ఫాలో అయ్యారంటే ఇక వారికి తిరుగు ఉండదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!