Advertisement
ఈ రోజుల్లో పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏ విధమైన అలవాట్లు చేస్తారో పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు.. మా పిల్లలు చెప్పిన పనులు చేయడం లేదు, ఎక్కువగా మారం చేస్తున్నారంటూ కౌన్సిలింగ్ నిపుణులతో బాధలు చెబుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులైనట. తల్లిదండ్రుల ప్రవర్తన వల్లే పిల్లలు ఈ విధంగా తయారవుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తల్లిదండ్రులు పిల్లల ముందు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: దినేష్ కార్తీక్ తో పాటు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా భార్య బాధితులే..!
అసభ్య పదజాలం:
పిల్లల ముందు అసభ్య పదజాలం చేయడం మానుకోండి. పిల్లల ముందు ఎలాంటి దూషణ పదాలు ఉపయోగించకూడదు. మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా అందరిముందు ఇలాంటి దుర్భాషలాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
మొబైల్ వాడకం:
Advertisement
ఈ కాలంలో మొబైల్ వాడకం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఇళ్లలో తల్లిదండ్రులు చేతిలో మొబైల్ పట్టుకొని నిత్యం దాన్ని చూస్తూ గడుపుతుంటారు. పిల్లలు మారం చేస్తే వారికి కూడా అదే మొబైల్ చూపిస్తూ ఉంటారు. దీంతో పిల్లలు కూడా ఆ మొబైల్ కి అలవాటు పడి మారాం చేస్తారు. కాబట్టి పిల్లల ముందు పెద్దలు ఎక్కువగా మొబైల్ ఉపయోగించరాదని అంటున్నారు నిపుణులు.
మద్యం ధూమపానం:
కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లల ముందే ధూమపానం, మద్యం సేవిస్తూ ఉంటారు. ఇది చూసిన కొంతమంది పిల్లలు మా తల్లిదండ్రులు చేస్తున్నారు కదా..! మేము చేస్తే తప్పేంటి? అనే భావనలోకి వెళ్లిపోతారట. అందువల్ల పిల్లల ముందు ఇటువంటివి మానుకోవాలి.
ఆహారం విషయం:
చాలా ఇళ్లలో పిల్లలకు ఆకలి వేస్తే కొంత మంది తల్లులు రెండు నిమిషాలలో అయిపోతుంది కదా అని నూడిల్స్ వంటివి చేసిపెడుతూ ఉంటారు. ఇలాంటి జంక్ ఫుడ్స్ వల్ల పిల్లలు చిన్నతనం నుండే ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. వీటివల్ల వారి ఆకలి మందగిస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యల బారినపడవచ్చు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులు. అందుకే ఇలాంటివి చేసినట్లయితే పిల్లలు కూడా వారిలాగానే అనుసరించే అవకాశాలు ఉన్నాయి.
Read also: SHAKUNTALAM MOVIE REVIEW: “శాకుంతలం” ఫస్ట్ రివ్యూ.. కంటతడి పెట్టాల్సిందే..!
https://manamnews.com/do-you-do-such-things-in-front-of-children-in-your-house/