Advertisement
మంచు మోహన్ బాబు స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. మంచు మోహన్ బాబు పై ఇప్పుడంటే ట్రోల్స్ వస్తున్నాయి. కానీ, టాలీవుడ్ లో ఆయన కూడా గొప్ప నటుడు అనే సంగతి ఒప్పుకోవాల్సిందే. పేదరాయుడు సినిమాతో పాటు మోహన్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోగా, విలన్ గా మోహన్ బాబు నట విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఆయన కొన్నిసార్లు నోరు జారడం వల్లనే ఈ ట్రోల్స్ వస్తున్నాయని నెటిజెన్లు అభిప్రాయపడుతుంటారు.
Advertisement
ఇది ఇలా ఉంటే మోహన్ బాబు జీవితంలో ఆయన మొదటి భార్య గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చిన ప్రారంభ రోజుల్లోనే మోహన్ బాబుకి, విద్యాదేవితో పెళ్లి జరిగింది. వీరి సంతానంగా మంచు విష్ణు, లక్ష్మీ పుట్టారు. అయితే మోహన్ బాబు వరుసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఆ సమయంలో మోహన్ బాబు షూటింగ్ ముగించుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చేవారట. అది భార్య విద్యాదేవికి అంతగా నచ్చేది కాదట. ఈ క్రమంలో ఇద్దరు మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయట. దాంతో ఓ రోజు బలవన్మరణం చేసుకుంది.
Advertisement
అయితే ఆ సమయంలో విష్ణు, లక్ష్మీ చిన్న పిల్లలు కావడంతో వాళ్లకి తల్లి లేని లోటు ఉండకూడదనే కారణంతో మోహన్ బాబుకి నచ్చజెప్పి విద్యాదేవి సోదరి నిర్మలాదేవితో పెళ్లి జరిపించారట. ఆ తర్వాత వీరికి మనోజ్ పుట్టాడు. ఇక నిర్మలాదేవి ఎలాంటి భేదభావం లేకుండా అక్క పిల్లలైనా విష్ణు, లక్ష్మీలను కూడా మనోజ్ తో సమానంగా చూస్తోంది. అయితే మోహన్ బాబు కెరీర్ లో జరిగిన ఈ సంఘటన మాత్రం ప్రేక్షకుల్లో అతి కొద్ది శాతం మందికే తెలిసిన విషయం. కాగా, మొదట్లో అతి కోపం ఉన్న మోహన్ బాబు, నిర్మలాదేవితో పెళ్లి అయ్యాక క్రమంగా తగ్గింది. అయితే ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మొహం మీదే మాట్లాడే తత్వం మాత్రం ఇప్పటికీ మారలేదు.
Read also : కృష్ణంరాజు అల్లుడు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తినే.. అతను ఎవరో తెలుసా?