Advertisement
Mukesh Ambani Driver Salary: భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతులైన జంట. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో ఈయన ఒకరు. దేశంలోనే విలువైన కంపెనీలలో రిలయన్స్ సంస్థ ముందంజలో ఉంటుంది. ఇక ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే పని మనుషుల జీతాలు, జీవితాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. ముంబైలోని 27 అంతస్తుల ఇంట్లో 600 మంది పని చేస్తారట. ఇంతటి విలాసవంతమైన ఇంట్లో పనిచేసే వారి జీతాలు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ముంబైలో నిర్మించిన ముకేశ్ అంబానీ విలాసవంతమైన ఇంటికి జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది.
Read also: మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
Advertisement
దీనికోసం ముఖేష్ అంబానీ నెలకు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ ఇంటిలో పనిచేసే కాపలాదారు నుండి చెఫ్, డ్రైవర్ వరకు ముఖేష్ అంబానీ తన ఇంటి సిబ్బందిని ఒక కుటుంబంలా చూసుకుంటాడు. ఇక ఆయన కారు డ్రైవర్ విషయానికి వస్తే.. సాధారణంగా ఏ డ్రైవర్ కి అయినా నెలసరి వేతనం 15 నుండి 20 వేల వరకు ఉండొచ్చు. కానీ అంబానీ వ్యక్తిగత కారు డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆమధ్య ముఖేష్ అంబానీ తన డ్రైవర్ కి జీతం ఇచ్చినప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?
ఆ వీడియో ప్రకారం ముఖేష్ అంబానీ తన డ్రైవర్ కి నెలకు అక్షరాల 2 లక్షల రూపాయల వేతనం ఇస్తున్నారు. డ్రైవర్ కు రెండు లక్షల జీతం ఏమిటని మీరంతా అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన తన డ్రైవర్ కి నెలకు రెండు లక్షల చొప్పున ఏడాదికి 24,00,000 రూపాయల ప్యాకేజ్ ముట్టచెబుతున్నారు. ఈ ప్యాకేజీ ఇండియాలో మేనేజర్ స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్యాకేజీలకు సమానం కావడం గమనార్హం. ఇక ముఖేష్ అంబానికి ఎంతో ఇష్టమైన బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ ఆర్మ్డ్ లగ్జరీ కారుతో పాటు సుమారుగా 168 లగ్జరీ కార్లు ఉన్నాయి.
Advertisement
Read also: Latest News in Telugu