Advertisement
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2004లో విడుదలైన చిత్రం ఆనంద్. మంచి కాఫీలాంటి సినిమా అనేది ఉప శీర్షిక. జీవితంలో ప్రేమ, ఆత్మ, అభిమానం, తృప్తి వంటి అంశాలతో కూడిన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో, పెద్ద తారాగణం లేకుండా సాదాసీదా కథనంతో వెలువడి అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. కుటుంబ నేపథ్యంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీలాంటి సినిమా అనిపించుకుంది. ఈ సినిమాలో రాజా, కమిలిని ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు.
Advertisement
Read also: PAWAN KALYAN : పవన్ కళ్యాణ్ స్టామినా ని బాక్స్ ఆఫీస్ కి, తెలుగు ప్రజలకి దగ్గర చేసిన 10 సినిమాలు !
ఈ చిత్రంలో ప్రతీ పాత్రకు ఆయానటులు జీవం పోశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి గుర్తుందా.. హీరో లిటిల్ ఫ్రెండ్ గా రాజా చుట్టూ తిరిగే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఈ చిన్నారి అసలు పేరు భకిత. ఇప్పుడు ఈమె వయసు 26 ఏళ్లు. ఆనంద్ సినిమా తర్వాత ఈ చిన్నారి తెరపై ఎక్కడ కనిపించలేదు. 18 ఏళ్ల తర్వాత ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె ప్రస్తుతం సమాజ సేవలో బిజీగా ఉంది.
Advertisement
భకిత 17వ సంవత్సరం నుండి మహిళల హక్కుల కోసం, సమాజంలో ఆడవాళ్లకు మగవాళ్ళ మాదిరిగా సమాన హక్కులు కల్పించాలని, ఆడపిల్లలపై దాడులు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని పోరాటం చేస్తోంది. సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అయితే ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది అచ్చం హీరోయిన్ లాగే ఉన్నావు.. మళ్లీ సినిమాలలో నటించొచ్చు కదా! అని అడిగేశారు. దీనికి ఆమె నో చెప్పేసింది. సినిమాలలో నటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ కాలం యువతకి ఆదర్శంగా నిలుస్తోంది భకిత.
Read also: అతను లారీ డ్రైవర్! ఆమె చదువుల తల్లి! సినిమాని మించిన పెద్దిరాజు ప్రేమగాధ!