Advertisement
సాధారణంగా చాలా మందికి ఇష్టమైన వంటకం సాంబార్.. ఈ సాంబార్ తో ఆహారం తింటే గానీ చాలా మంది భోజన ప్రియులకు సాటిస్ఫాక్షన్ కాదు. అలాంటి సాంబార్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? ఎలా వచ్చింది.? అనేది తెలుసుకుందాం.. ఈ సాంబార్ వెనుక చాలా చరిత్ర ఉంది. తంజావూరుకు చెందినటువంటి మరాఠి రాజుల పరిపాలనలో శివాజి పుత్రుడైనా షాంబాజీ బంధువైన రాజు షాహుజిని చూడటానికి వచ్చాడట. మరాఠి లు వంటలో పులుపుకు కోకం వాడతారు.కానీ తాంజావూరులో అది దొరకదు. కాబట్టి చింతపండు గుజ్జును ఉడికిన కంది పప్పులో వేసి తయారు చేసిన ఆ వంట షాంబాజీకి చాలా నచ్చిందట.
Advertisement
also read: పరాయి వాళ్ళ కొరకు పిల్లల్ని కనని సెలబ్రిటీస్ ఎవరంటే..?
Advertisement
అతని పేరుతోనే శాంబర్ అనే పేరు వచ్చింది… అదే సాంబార్ గా మార్పు చెందింది. దీని తర్వాత ఈ వంటకంలో అనేక మార్పులు వచ్చాయి. ఇందులో ధనియాలు, శనగ పప్పు కలిపి పొడి చేసి తయారు చేయడం వాళ్ళ రుచి ఎక్కువ అయింది. ఈ సాంబార్ ను శంభాజీయో స్వయంగా చేశాడని అంటుంటారు. ఇక ఆ తర్వాత వంటల విషయంలో అనేక మార్పులు రావడంతో ఎవరికి నచ్చిన విధంగా వారు తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఉప్పు మరియు చింతపండు,మసాలా పదార్థాలన్నింటినీ కలిపితే సంబరాలన్నది సంస్కృతంలో వచ్చిన పదం..
తెలుగులో దీనికి సంబరాలనీ పేరు ఉంది. మరాఠాలను ముందుగా తంజావూరుకు చెందిన తెలుగు నాయక రాజులు పాలించారు. అందుకే తెలుగు వాడకం తంజావూరు లో ఎక్కువగా ఉంటుంది. సంబరాలు అన్ని కలిపి చేయడం వలన సాంబారు అనే పేరు వచ్చి ఉండొచ్చు అని భావిస్తారు. జీతం అనే అర్థంలో సంబళం అనే పదాన్ని తెలుగులో చాలా తక్కువమంది వాడతారు తమిళంలో మాత్రం చాలా మంది ఉపయోగిస్తారు. సాల్ట్ అనే మాట నుండి సాలరీ వచ్చినట్టుగా సంబరం అనే పదం నుండి సాంబార్ వచ్చి ఉండొచ్చని భావిస్తుంటారు.