Advertisement
కార్తీకదీపం.. బుల్లితెర బాహుబలి గా స్థిరపడిపోయిన ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లుగా ఈ సీరియల్ జాతీయ స్థాయిలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. ఈ సీరియల్ అంటే చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వారి సైతం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సీరియల్ తో బుల్లితెర రాణిగా పేరు తెచ్చుకున్న వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి అసలు ఈ సీరియల్ లో ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
Advertisement
Read also: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ కొత్త సినిమాలు ఇవే..
ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లాలోని ఎడప్పల్లి ప్రాంతం. వంటలక్కకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. లా కంప్లీట్ చేసిన వంటలక్క కొంతకాలం పాటు లీగల్ అడ్వైజర్ గా కూడా చేసింది. అయితే ఫోటోలు తీయాలనే ఆసక్తితో ఫోటోగ్రఫీ నేర్చుకుని.. పెళ్లిళ్లకు ఫోటోగ్రాఫర్ గా కూడా వర్క్ చేసింది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ చేస్తూ మలయాళీ సీరియల్ కరముత్తూలో నటించింది. ఈ సీరియల్ చేస్తూనే కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా చేసిందిి. మలయాళం లో కరముత్తు సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సీరియల్ ని తెలుగులో “కార్తీకదీపం” పేరుతో రీమేక్ చేశారు.
Advertisement
ఈ సీరియల్ తెలుగులో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో తెలిసిందే. ఈ సీరియల్ లో నటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే సీరియల్ లోనే కాదు వంటలక్క వెండితెరకు పరిచయం కాబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభువు దర్శకత్వంలో అక్కినేని హీరో నాగచైతన్య 22వ సినిమా లో వంటలక్క ఓ కీలకపాత్ర పోషించబోతోందిి. మరి వంటలక్క పేరు ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.
Read also: వన్డే క్రికెట్ లో 10 ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు వీరే!