Advertisement
Honey Rose Age: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన మెప్పించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో తన అందంతోపాటు నటనతో మెప్పించింది మలయాళీ బ్యూటీ హనీ రోజ్. ఈమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్రంలో హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది.
Honey Rose: Age, Background, Movies, Upcoming Movies
Read also: అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన 10 మంది వీరే..!!

Honey Rose Age
తాజాగా మరోసారి వీరసింహారెడ్డి సక్సెస్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ వివరాల్లోకి వెళితే.. ఈ మలయాళీ కుట్టి కేరళలోని తడుపుజా సైరో – మలబార్ కేథలిక్ కుటుంబంలో 1991 సెప్టెంబర్ 5న జన్మించింది. ఈమె కమ్యూనికేటివ్ ఇంగ్లీషులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చదివింది. ఈమె మలయాళ చిత్రాలలో ఎక్కువగా నటించింది. మలయాళం తో పాటు కొన్ని తమిళ, కన్నడ చిత్రాలలో కూడా కనిపించింది. ఈమె 2005లో తన 14 వ ఏటనే యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించింది. 2005లో మలయాళం లో విడుదలైన “బాయ్ ఫ్రెండ్” సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు వీర సింహారెడ్డి లో చిన్న బాలయ్యకు తల్లిగా నటించిన హనీ రోజ్ వయసు కేవలం 31 సంవత్సరాలు.
Advertisement

Hone Rose Age
వీర సింహారెడ్డి తో హనీ రోజ్ కి కావలసిన పాపులారిటీ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈమెకి టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విరసింహారెడ్డి తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య తన తదుపరి ప్రాజెక్టు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించనున్నారు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా హనీ రోజ్ ను తీసుకోవాలని బాలయ్య ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే మరోసారి బాలయ్య పక్కన ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తుందన్నమాట.
Advertisement
Read also: యాంకర్ అనసూయ నాన్న గారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? ఆయన ఎవరంటే ?