Advertisement
1990 దశాబ్దంలో హీరోయిన్ గా వెండి తెరపై అద్భుతాలు సృష్టించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోనూ రోజా తన నటనతో మెప్పించింది. సినిమాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన రోజా ప్రస్తుతం రాజకీయాలలో కూడా రాణిస్తుంది. ఎక్కడో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రోజా సినీరంగంలోకి రావడం, ఆ తర్వాత రాజకీయాలలో నిలదొక్కుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ స్థాయికి చేరిన రోజా పడ్డ శ్రమతో పాటు కుటుంబ మద్దతు కూడా కీలకంగా నిలిచింది.
Advertisement
Read also: జపాన్‌లోనూ దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు ఇవే..అక్కడ కూడా మన హవానే
ఈమె ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో 16 – 11- 1971 న జన్మించారు. రోజా తండ్రి నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు జన్మించింది. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా ఆమె తండ్రి హైదరాబాద్ కి వలస వెళ్లారు. నాగరాజు రెడ్డి డాక్యుమెంటరీలో సౌండ్ ఇంజనీర్, తల్లి లలిత నర్సుగా పనిచేసేవారు. రోజా కి కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే నటనపై ఆసక్తి ఉండడంతో రోజా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్న రోజా డిగ్రీ చదువుతుండగానే ప్రేమ తపస్సు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
Advertisement
అంతకుముందు తమిళ చిత్రం చింబరతి మూవీలో నటించింది. ఆ సినిమా తమిళంలో మ్యూజికల్ గా హిట్ కాగా.. తెలుగులో చామంతి పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్కే సెల్వమణి రూపొందించారు. ఆయనతోనే ప్రేమలో పడి రోజా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు. 2004లో రాజకీయాలలోకి వచ్చిన రోజా నగరి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి పై పోటీ చేసింది. 2009లో చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజా.. అనంతరం వైఎస్ఆర్ సీపీలోకి వచ్చారు. 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికలలో రెండుసార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
Read also: టి20 ప్రపంచ కప్ లో టీమిండియా రికార్డులు!