Advertisement
నాటి తరం హీరోలకు నేటితరం హీరోలకు ఎంతో తేడా ఉంది. ఆ తరం హీరోలు కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతలుగా కూడా ఎంతగానో సత్తా చాటారు. నేటితరం హీరోలలో చాలామంది నటనకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అలాగే ఇప్పటి హీరోలు కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి. ఒక్క సినిమా చేస్తే కోట్లు వచ్చి పడతాయి. ఓ స్టార్ హీరోగా గుర్తింపు రావడం ఏ రోజుల్లోనైనా తేలికే కానీ దానిని నిలబెట్టుకోవడమే కష్టం. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఈ తరం హీరోల రెమ్యూనరేషన్ తో పోల్చితే ఆ తరం హీరోల రెమ్యునరేషన్ కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పాలి. అయితే ఓ హీరో మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికానికి, ఇప్పుడు తీసుకుంటున్న పారితోషికానికి అస్సలు పొంతన ఉండదు. ఇప్పుడు అలాంటి స్టార్ల మొదటి సినిమాల పారితోషికం గురించి తెలుసుకుందాం.
Advertisement
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?
1) అమితాబ్ బచ్చన్.
ఫిబ్రవరి 15, 1969 లో తన తొలి సినిమాకి సైన్ చేశారు అమితాబ్ బచ్చన్. అప్పట్లో ఆ సినిమాకి 5000 పారితోషికం అందుకున్నారు. ఐదువేల తో మొదలైన అమితాబ్ ప్రయాణం ఇప్పుడు 10 కోట్లకు చేరింది.
2) దీపికా పదుకొనే.
దీపికా పదుకొనే మొదటి సినిమా ఓం శాంతి ఓం. ఈ చిత్రానికి ఈమె ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని టాక్. ప్రస్తుతం 10 కోట్ల నుండి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది దీపికా పదుకొనే.
3) మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ” పునాది రాళ్లు”. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం రూ. 1116. కానీ ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.
4) కమల్ హాసన్.
Advertisement
కలతూర్ కన్నమ్మ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు కమల్ హాసన్. ఈ చిత్రానికి ఆయన తీసుకున్న పారితోషికం రూ. 500. ఇక ప్రస్తుతం ఈ యూనివర్సల్ స్టార్ ఒక్కో సినిమాకి 30 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
5) అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ మొదటి చిత్రం “ఖయామత్ సే కమాయత్ తక్”. ఈ సినిమాకి అమీర్ ఖాన్ రూ. 11000 రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకి 90 కోట్ల నుండి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
6) అజిత్.
అజిత్ మొదటి చిత్రం ” పాసమాలార్గల్”. ఈ చిత్రానికి అజిత్ అందుకున్న పారితోషికం రూ. 2500. ఇక ప్రస్తుతం అజిత్ ఒక్కో సినిమాకి 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
7) మోహన్ లాల్.
మోహన్ లాల్ మొదటి చిత్రం “మంజిల్ విరింజల్ పొక్కల్”. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం రూ. 2,000. ప్రస్తుతం మోహన్ లాల్ ఒక్కో సినిమాకి 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
8) అక్షయ్ కుమార్.
అక్షయ్ కుమార్ మొదటి సినిమా “సౌగంద్”. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం రూ. 51,000. ప్రస్తుతం అక్షయ్ ఒక్కో సినిమాకి 60కొట్ల పారితోషికం అందుకుంటున్నారు.
9) విజయ్.
వెట్రి అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఈ చిత్రానికి ఆయన తీసుకున్న పారితోషికం రూ. 500. విజయ్ ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 కోట్లు అందుకుంటున్నారు.
10) జూనియర్ ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని. ఈ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం 4 లక్షలు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్.
Read also: సుందరకాండ అపర్ణ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె ఎలా మారిపోయిందో తెలుసా..?