Advertisement
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ సీతారామం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఒక సాధారణ చిత్రంగా ఏ అంచనాలు లేకుండా విడుదలైంది సీతారామం చిత్రం. మంచి కథను ఎంతో సున్నితంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు హనూ రాఘవపూడి. సీతారామంలో సీత పాత్రలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు. ఎవరూ లేని ఓ సైనికుడు దేశంపై చూపించే ప్రేమ.. దేశం మొత్తం మీద ప్రేమను ఒక సైనికుడి పై చూపించే ఓ అమ్మాయి.. వీరిద్దరి మధ్య జరిగిన ప్రణయ ప్రేమాయనమే ఈ సీతారామం. ఇటీవల కాలంలో ఇంత మంచి ఫీల్, సోల్ ఉన్న సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదేమో.
Advertisement
Read also: రాజమౌళి అమ్మగారు చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?
అయితే ఈ చిత్రం విడుదలైన సందర్భంలో ఈ కథ నిజంగానే జరిగిందా? అని కొందరి ప్రేక్షకులు చర్చించుకున్నారు. ఈ మూవీ రెండు టైమ్ లైన్స్ లో నడుస్తోంది. 1960లో, 1984 సంవత్సరాలలో నడుస్తోంది. అలాగే ఈ చిత్రంలోని కొన్ని పాత్రలను రామాయణం ఆధారంగా రాసుకున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక ఆఫ్రిన్ పాత్రలో మ్యాజిక్ చేసేసింది. సీతకి, రామ్ లెటర్ ని ఇచ్చే పాత్రలో రష్మిక, తరుణ్ భాస్కర్ నటించారు. 2007లో ఒక లైబ్రరీలో ఆయన ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఒక పాత ఉత్తరం కనిపిస్తుంది. ఒక తల్లి హాస్టల్లో ఉన్న తన కుమారుడి కోసం ఆ లెటర్ రాసిందని.. దాని నుంచే తనకు ఈ కథ ఆలోచన వచ్చిందని దర్శకుడు గతంలో తెలిపారు. ఈ చిత్రంలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో చాలా హుందాగా కనిపించింది మృణాల్. అయితే ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్ర కూడా.. చరిత్రలోని ఒక వ్యక్తి ఆధారంగానే రాసుకున్నట్లు తెలుస్తోంది. చరిత్రకారుల ప్రకారం 16వ శతాబ్దంలో ఢిల్లీని అక్బర్ పరిపాలించేవాడు.
Advertisement
ఆయన దర్బారులో పనిచేసే ఒక వ్యక్తి కుమార్తె పేరే మెహరున్నీసా. ఆమె కూడా ఆ దర్బార్ లోనే పనిచేస్తూ ఉండేది. అయితే అక్బర్ కుమారుడు సలీం ఆమెను చూసి ఇష్టపడతాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈ విషయం తెలిసిన అక్బర్ ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇక తర్వాత అక్బర్ కొడుకు సలీం జహంగీర్ రాజు అవుతాడు. అప్పుడు మెహరున్నీసా భర్తను చంపేసి ఆమెను మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత సలీం జహంగీర్ రాజు ఆమెకు పెట్టుకున్న పేర్లలో ఒకటే నూర్జహాన్. ఆ తరువాత జహంగీర్ చెడు వ్యసనాలకు బానిస కలవడంతో నూర్జహాన్ ఆ రాజ్యాన్ని పాలిస్తుంది. అప్పుడే తన పేరుతో నాణాలను కూడా ముద్రిస్తుంది. ఆమె 16వ శతాబ్దంలోని ఒక శక్తివంతమైన మహిళగా చరిత్రలో నిలిచింది.
Read also: YS VIVEKANANDA REDDY: వివేకా హత్య కేసు లో మరో ట్విస్ట్ ! తెరపైకి మరో మహిళ ఎవరు ఆమె ?