Advertisement
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురం లోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. 1970 ల నేపథ్యంలో సాగే కధ ఇది. ఈ చిత్రం ఓ దొంగ బయోపిక్ అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దొంగలకు కూడా బయోపిక్ తీస్తారా అనే సందేహాలు రావచ్చు. బాలీవుడ్ లో ఇప్పటికే ఈ ట్రెండ్ నడుస్తోంది. అయితే రవితేజ చేస్తున్న ఈ బయోపిక్ లోని వ్యక్తి సాధారణ దొంగ కాదు.. పోలీసులను సైతం బెంబేలెత్తించిన పెద్ద గజదొంగ.
Read also: JABARDASTH COMEDIAN NARESH AGE: జబర్దస్త్ నరేష్ అసలు వయస్సు ఎంతో తెలుసా?
అతడిని స్టువర్టుపురం రాబిన్ హుడ్ అనేవారు. రాబిన్ హుడ్ గురించి తెలుసు కదా.. బాగా డబ్బున్న వారిని కొల్లగొట్టి, ఆ సంపదని పేదలకు పంచే వారిని ప్రధాన అంశంగా తీసుకొని ఇంగ్లీషులో కథలు ఉన్నాయి. సినిమాలు, సిరీస్ లు కూడా వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో ఉండే స్టువర్టుపురానికి చెందిన గోకరి నాగేశ్వరరావు అనే ఓ దొంగను కూడా టైగర్ అని, ఆంధ్ర రాబిన్ హుడ్ అని కొందరు చెబుతారు. దొంగతనాలు చేసే ఈ వ్యక్తి అప్పట్లో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఒరిస్సా వంటి రాష్ట్రాలలోనూ ఫేమస్. ఇతను ఓ దొంగల ముఠాకి నాయకుడని కూడా చెప్తారు. టైగర్ నాగేశ్వరరావు పై కొంపల్లి సురేందర్ అనే పరిశోధకుడు పరిశోధన సాగించారు. ఈ పరిశోధనలో అనేక కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వారు ముగ్గురు అన్నదమ్ములు. నాగేశ్వరరావుకు అన్నయ్య ప్రభాకర్, తమ్ముడు ప్రసాద్ ఉన్నారు.
Advertisement
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమను కనీసం ప్రజలు పట్టించుకోలేదని, మనుషులుగా కూడా గుర్తించలేదన్న భావనతో దొంగతనాలను ప్రారంభించారు. 1973లో బనగానిపల్లిలో చేసిన బ్యాంకు దొంగతనం సంచలనంగా మారింది. నాగేశ్వరరావు దొంగతనాలు చేసినప్పటికీ ఆ ధనాన్ని అందరికీ దానధర్మాలు చేసేవారట. అలా ప్రజలకు పంచడం వల్లనే పోలీసుల నుంచి వారు తప్పించుకోవడానికి అందరూ సహకరించే వారట. నాగేశ్వరరావు ఎన్నోసార్లు జైలు నుంచి కూడా ఎస్కేప్ అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే చెన్నై జైలు నుంచి తప్పించుకున్న తీరుతో ఆయనని అంతా టైగర్ అని పిలవడం మొదలుపెట్టారు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు చివరికి 1987లో పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు పేరుతో రవితేజ హీరోగా బయోపిక్ రాబోతుండడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Read also: RANGASTHALAM MOVIE: రామ్ చరణ్ కోసం సుకుమార్ చూపించిన ఈ లాజిక్ కనిపెట్టరా ?