Advertisement
టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతికలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్”.. ఈ ఒక్క డైలాగ్ చాలు సాయికుమార్ ని డైలాగ్ కింగ్ అని చెప్పడానికి. అంతేకాదు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సాయికుమార్ డబ్బింగ్ జత కలిస్తే అత్యద్భుతంగా మారుతుంది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా.. ఆయన ప్రవేశిస్తే సంచలనం.. హీరో ఎవరైనా, భాష ఏదైనా.. ఆయన గొంతు సాయం చేస్తే ఆ పాత్ర చిరస్థాయి జ్ఞాపకం.
Advertisement
Read also: సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..?
తండ్రి నుండి వారసత్వంగా అనువాద కలను అలవాటు చేసుకున్న సాయికుమార్ రంగస్థల కళాకారుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. సాయి కుమార్ తండ్రి జై శర్మ కూడా మంచి నటుడు అలాగే కంచు కంఠంతో డబ్బింగ్ చెప్పేవారు. ఆయన గొంతు తన ముగ్గురు కుమారులకు వచ్చింది. సాయి కుమార్ తో పాటు రవిశంకర్ కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కెరియర్ లో దూసుకుపోతున్నారు. అలాగే సాయికుమార్ చిన్న తమ్ముడు అయ్యప్ప కూడా ఇటీవల కేజీఎఫ్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగులో నేరుగా చేసిన సినిమాలలో కూడా సాయికుమార్ తన గాత్రం అందించారు.
Advertisement
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెదరాయుడు. మోహన్ బాబు – రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన పెద్దరాయుడు ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలోని డైలాగులు ఇప్పటికీ హైలెట్. రజనీకాంత్ గొంతులోని సాయికుమార్ గాంభీర్యం ఈ సినిమాలోని పాపారాయుడు పాత్రకి ఆయువుపట్టు. ఈ చిత్రం ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే రజనీకాంత్ కోసం, ఆయన చెప్పే డైలాగ్స్ కోసం చూసేవారు చాలామంది ఉన్నారు. అంతలా సాయికుమార్ ఎందరో బయటనటులను మన తెలుగు వారికి చేరువ చేశారు.
Read also: ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన టాలీవుడ్ హీరోలు