Advertisement
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు. అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తన జనసేన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలతో ముందుకు పోతున్నారు. ఆయన మొదటి భార్య నందిని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
పవన్ కళ్యాణ్ 1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే నందిని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతేకాదు ఆమె తన మెయింటెనెన్స్ కోసం నెలకి 5 లక్షలు పవన్ కళ్యాణ్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది. అయితే పవన్ కళ్యాణ్ 1999లో ఆమె నుంచి విడాకులు కోరగా, ఆమె విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది. తర్వాత 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు పవన్ కళ్యాణ్.
Advertisement
మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ 2008లో పెళ్లి చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్రసీమలోకి అడుగు పెట్టారు. “అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదుగుతూ పవర్ స్టార్ అయ్యారు. ఇక నందిని విషయానికి వస్తే పవర్ స్టార్ తో విడాకుల తర్వాత ఆమె తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2007లో విడాకులు తీసుకున్న తర్వాత 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం ఆడింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది.
READ ALSO : సబ్బు, సర్ఫ్ లేని రోజుల్లో ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసా..?