Advertisement
ఏటీఎమ్స్ లో గానీ, షాపుల్లో గాని, బ్యాంకు లో గాని చిరిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు వాటిని తీసుకుంటాం. కానీ మనం ఇస్తే మాత్రం ఎవరు తీసుకోరు. అయితే ఆ చిరిగిపోయిన నోట్లను ఎక్కడ మార్చాలి? ఎలా మార్చాలి? ఎంత అమౌంట్ వరకు మార్చుకోవచ్చు? అలాగే ఎన్ని నోట్లను ఇలా చిరిగి పోయి ఉంటే మార్చుకోవచ్చు? అసలు ఆర్బిఐ ఏం చెబుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో మీ దగ్గర డ్యామేజ్ అయ్యి లేదా చిరిగి పోయిన నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంకు వాళ్లకు వాటిని తీసుకోము అని చెప్పే అధికారం లేదు. అయితే ఆ చిరిగిన నోట్లను ఇచ్చేందుకు బ్యాంకు లో మీరు ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది.
Advertisement

Advertisement
ఒకవేళ బ్యాంకు వాళ్లు చిరిగి పోయిన నోట్లు తీసుకోము అంటే మాత్రం మీరు ఆర్బిఐ కి ఆ బ్యాంకు మీద ఆన్లైన్ లో కంప్లైంట్ చేయవచ్చు. అయితే చాలామంది ఈ చిరిగిపోయిన నోట్లని ఆర్బీఐ తీసుకొని ఏం చేస్తుంది. వాటిని ఎలాగూ మళ్ళీ అతికించి ఇవ్వరాదు కదా అని డౌట్ పడతారు. కానీ ఆ చిరిగి పోయిన నోట్ల స్థానంలో ఆర్బిఐ వేరే నోట్లను తయారు చేస్తుంది. అయితే ఈ చిరిగిపోయిన పాత నోట్లను అంతకు ముందైతే కాల్చేసేవారట. కానీ ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రీసైకిల్ చేస్తున్నారు. అంటే పేపర్ ఉత్పత్తుల కోసం ఈ కరెన్సీ నోట్లను మళ్ళీ ఉపయోగిస్తున్నారు.




