Advertisement
చాలామంది ప్రజలకు నిద్రలో కొన్ని రకాల కలలు వస్తూ ఉంటాయి. మనిషి జీవితంపై కలల ప్రభావం ఉంటుందా? జ్యోతిష్య శాస్త్రం కలల గురించి ఏం చెప్తుంది? పురాతన కాలం నుండి కలలు భవిష్యత్తు సంఘటనకు సంబంధించినవిగా కనిపిస్తాయి. నిద్రలో వచ్చే ప్రతి కలకి ఒక అర్థం అనేది ఉంటుంది. ఒక్కోసారి ఇంటి పెద్దలు మన కలలో కనిపిస్తారు. అయితే కొన్నిసార్లు అది వారి పట్ల మనకు ఉన్న ప్రేమ కావచ్చు, కొన్నిసార్లు వారు కలలోకి రావడం మనకు కొన్ని సూచనలను ఇస్తుంది. కలల ప్రపంచానికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.
Advertisement
Read also: చాణక్య నీతి ప్రకారం పురుషులకంటే మహిళలు ఈ 4 విషయాలలో ముందుంటారట !
ప్రతి కలకు అర్థం స్వప్న శాస్త్రంలో ఉంది. కాబట్టి కలలో చనిపోయిన పెద్దలను చూడడం అంటే ఏమిటో తెలుసుకుందాం. చనిపోయిన వారు కలలో కనిపిస్తే వారు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. అలాంటి కళలను అసలు తేలికగా తీసుకోవద్దని కూడా శాస్త్రం చెబుతుంది. హిందూమతంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృపక్షం భద్రపద మాసం పౌర్ణమి రోజు ప్రారంభమై అశ్విని మాసం అమావాస్యతో ముగుస్తుంది. ఈ రోజులలో చనిపోయిన పూర్వీకులకు శ్రద్ధ బలి తరఫున పిండ ప్రధానం చేస్తుంటారు. పితృదేవతలు పితృలోకం నుండి భూమికి వస్తారని చాలామంది నమ్ముతారు. పితృపక్షం రోజుల్లో కలలో పూర్వీకులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని పండితులు చెబుతున్నారు.
Advertisement
ఎవరి కోరికలు నెరవేరకుండా మరణిస్తారో, ఆ వ్యక్తులు వారి వారసుల కలలోకి వస్తారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో పూర్వీకుల కోరికలు నెరవేరేవరకు వారి ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. అందువల్ల వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం పూర్వీకులు తమ వారసుల కలలోకి వస్తారు. అయితే కలలో పూర్వీకులు ఎలా కనిపిస్తారో దానిని బట్టి వారు సంతోషంగా ఉన్నారా? బాధతో ఉన్నారా? అనేది తెలుస్తుంది. వారు ఉన్న పరిస్థితిని బట్టి మనం సుఖంగా ఉంటామా? లేదా ఏదైనా అశుభం జరుగుతుందా అనేది కూడా సూచనప్రాయంగా తెలుస్తోంది. ఎవరైనా వ్యక్తులు ప్రమాదవశాత్తు, లేదా ప్రకృతి విపత్తులోనో మృతి చెందకుండా సహజసిద్ధంగా మరణిస్తే అలాంటి వ్యక్తుల కుటుంబాలకు చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మెండుగా ఉంటాయట. చనిపోయిన వారు కలలో ఆనందంగా ఉన్నట్టు, ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తే అప్పుడు ఆ కలలు వచ్చిన వారికి అంతా మంచే జరుగుతుందట.
ఎవరైనా వ్యక్తులు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా ఎవరైనా పెద్దవారు తోడ్పాటును అందిస్తే అప్పుడు చనిపోయిన తమ పూర్వీకుల ఆశీస్సుల వల్లే ఇలా జరిగిందని తెలుసుకోవాలి. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారితో సరిగ్గా మెలుగుతూ వారిని బాగా చూసుకుంటున్న వారికి కూడా చనిపోయిన పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయట. ఇక పూర్వీకులతో కలిసి భోజనం చేస్తున్నట్లు కల వస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం. మరణించిన తండ్రి కలలో కనిపిస్తే మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారని అర్థం. ఇక పూర్వీకులతో మాట్లాడుతున్నట్టు కలడు కంటే మీకు పేరు, కీర్తి వస్తుందని అర్థం. ఇంట్లో చనిపోయిన వారు నిద్రిస్తున్నట్లుగా కల వస్తే మీరు అతిపెద్ద ప్రమాదం నుండి బయటపడుతున్నారని అర్థం. ఇక పూర్వికులు కలలో ఏడుస్తూ ఉండడం ఆశుభం. అలా జరిగితే పూర్వీకుల సంతృప్తి కోసం పిండదానం, శ్రాద్ధతర్పణం వంటివి చేయాలని చెబుతారు. ఇక అదే సమయంలో ఆలయాలకు వెళ్లి పూజాదికాలు నిర్వహించడం కూడా కొంతమేర జరగబోతున్న ఉపద్రవాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.