Advertisement
టాలీవుడ్ ఓ వింతైన ప్రపంచం. ఈ విచిత్ర ప్రపంచంలో వింతలెన్నో. ఈ రంగంలో కొందరు ఎదిగే తీరు ఎంతో విభిన్నంగా ఉంటుంది. కొంతమంది వారి జీవితాలను కూడా ఫణంగా పెట్టి కృష్ణ నగర్ చుట్టూ తిరుగుతుంటారు. కేవలం తెలివితేటలు, చురుకైన యాటిట్యూడ్ తో ఎదిగే వాళ్ళు కొందరు ఉంటే.. అదృష్టం కలిసొచ్చి, ప్లాన్ వర్క్ అవుట్ అయి ఎదిగేవారు మరికొందరు కనిపిస్తుంటారు. అలా కెరీర్ ని రిస్క్ లో పెట్టి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ సాధించిన అతి తక్కువ మందిలో సంగీత దర్శకుడు రమణ గోగుల ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందుకు ఈయన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి.
Advertisement
Read also: రూ.400 కోట్లు సంపాదించి పెట్టిన కాంతారా నుండి రిషబ్ శెట్టికి మిగిలింది ఇంతేనా?
ఖరగ్పూర్ లో ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. అమెరికాకి పై చదువుల కోసం వెళ్లి లూసియానా స్టేట్ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్ పూర్తి చేశారు. అక్కడే టేక్కేగా ఉద్యోగం చేస్తూనే స్టార్ట్ – అప్ కంపెనీ కూడా పెట్టారు. ఆ తర్వాత 1995లో ఇండియాకి తిరిగి వచ్చి సంగీతం మీద ఉన్న ప్రేమతో మిథి రిథమ్స్ అనే బ్యాండ్ తో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో ఇండీ పాప్ స్టూడియో వారికి ఒక ఆల్బమ్ తయారు చేసి ఇవ్వగా అది బాగా హిట్ అయింది. ఈ ఆల్బమ్ తో నలుగురి దృష్టిలో పడ్డారు రమణ గోగుల. ఆ తర్వాత తొలి సినిమానే విక్టరీ వెంకటేష్ ప్రేమంటే ఇదేరా చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా మ్యూజికల్ గా మంచి హిట్ కావడంతో రమణ గోగుల వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
Advertisement
ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో తమ్ముడు, జానీ, అన్నవరం, బద్రి, అలాగే మహేష్ బాబు యువరాజు, ప్రభాస్ తో యోగి, వెంకటేష్ తో లక్ష్మి, వాసు ఇలా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని అందించాడు. ఇలా వచ్చిన డబ్బుతో సుమంత్ తో బోణి అనే సినిమాని నిర్మించాడు. ఈ చిత్రం భారీ ఫ్లాప్ కావడంతో రమణ గోగుల అప్పల పాలయ్యాడు. ఈ నష్టాలని లెక్కచేయకుండా డైరెక్టర్ తేజ తో 1000 అబద్ధాలు అనే మరో సినిమా నిర్మించాడు. అది కూడా డిజాస్టర్ కావడంతో ఇక కోలుకోలేకపోయాడు. చాలా కాలం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తిరిగి మళ్లీ అమెరికా వెళ్ళిపోయాడు. మళ్లీ స్టార్ట్ – అప్ కంపెనీని ఏర్పాటు చేసి బాగా సంపాదిస్తున్నాడు.
Read also: రిలేషన్ షిప్ లోకి వెళ్లే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి!