Advertisement
జీవితం ఎప్పుడు హ్యాపీగా నడిచిపోదు. రకరకాలు కష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే ఏ కష్టం వచ్చినా ఏదో రకంగా ఎదుర్కొంటూ ముందుకు సాగక తప్పదు. కానీ ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న సమస్యలు వచ్చినా తట్టుకోవడం లేదు. తాజాగా ఓ చిన్న సమస్య కారణంగా ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ కి గురవుతున్నారు. ఇంతకీ ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలుసా..?
Advertisement
Read also: NAGA CHAITANYA CUSTODY REVIEW IN TELUGU: నాగచైతన్య “కస్టడీ” సినిమా మొదటి రివ్యూ
నిజామాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లి మండలం జక్రన్ పల్లి గాంధీనగర్ కి చెందిన అందే రవితేజ (26) అనే యువకుడు నివాసం ఉండేవాడు. ఈ యువకునికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో మేన మరదలు ఉండేది. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. అయితే కొన్ని నెలలుగా సదరు యువతి రవితేజతో మాట్లాడడం లేదు. అతను కారణం అడిగినా చెప్పడం లేదు. దీంతో రవితేజ ఆ యువతీని పెళ్లి విషయంలో మరింత సీరియస్ గా అడిగాడు. అయినా ఆ యువతి స్పందించకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన రవితేజ సోమవారం ( మే 8) తెల్లవారుజామున యువతి ఇంటికి వచ్చాడు.
Advertisement
యువతి తల్లిదండ్రులతో మీ కూతురిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అత్తమామలు నిరాకరించినట్లు సమాచారం. దీంతో రవితేజ మరదలు ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆ* పాల్పడ్డాడు. ఇది గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు వెంటనే 100 కు ఫోన్ చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరదలి కోసం రవితేజ చనిపోవడంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇలా ప్రేమ విఫలమైందని ఆ* పాల్పడడం సమస్యలకు పరిష్కారం కాదని సామాజిక కార్యకర్తలు, పోలీసులు చెబుతున్నారు.
Read also: మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి..!!