Advertisement
దాదాపుగా ప్రతి ఇండస్ట్రీలో సినిమాకి ఏవిధమైన క్రేజ్ ఉంటుందో దానికి ఏ మాత్రం తగ్గకుండా సీరియల్స్ కు కూడా ఉంటుంది.. చాలా మంది ఇంట్లో గృహిణులు టీవీలో ఎలాంటి ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినా,సినిమా వచ్చినా, క్రికెట్ వచ్చినా వాటన్నింటిని పక్కన తోసి డైలీ సీరియల్ వైపు చూస్తూ ఉంటారు. సీరియల్ చూసి ఆరోగ్యం పాడు చేసుకున్న మహిళలు కూడా చాలామంది ఉన్నారు. ఈ విధంగా సీరియల్ కథలతో ఇళ్లలో యుద్ధాలు కూడా జరుగుతాయి.
Advertisement
ఈ విధంగా సీరియల్ తీయాలన్నా బడ్జెట్ ఎక్కువే.. ఎందుకంటే సీరియల్స్ లో కూడా కాస్ట్లీ కాస్ట్యూమ్స్ అంటే బంగారం, కార్లు,దుస్తువులు వాడతారు. దీనివల్ల నిర్మాతలకు భారీ గానే బడ్జెట్ అవుతుంది. ముఖ్యంగా మహిళలు సీరియల్స్ లో చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు. అందులో సీన్ ఏదైనా సందర్భం ఏదైనా సరే కాస్ట్లీ చీరలు కట్టుకొని మెరిసి పోతూ ఉంటారు. అంతా పక్కనపెడితే.. అసలు సీరియల్స్ లో నటించే నటీమణులు చాలా కాస్ట్లీ చీరలు దరిస్తుంటారు. మరి ఆ చీరలు ఎక్కడి నుంచి వస్తాయి..
Advertisement
Also READ: Telugu cinema News, Telugu News
వారు సొంతంగా కొనుక్కుంటారా.. లేదంటే ఆ సీరియల్ యూనిట్ ఇస్తుందా అనే అనుమానాలు చాలా మందికి వచ్చే ఉంటుంది.. ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.. సీరియల్ షూటింగ్ సమయంలో కొంత మంది సొంత చీరలనే వాడతారు.. కానీ కొంతమందికి ప్రొడక్షన్ వాళ్ళు చీరలు, కాస్ట్యూమ్స్, డిజైన్స్ ఇస్తారు. ఇలా సంవత్సరాలు సీరియల్స్ కొనసాగుతాయి. కాబట్టి ఎవరికీ డౌట్ రాకుండా ఆ చీరలు నెల రోజులకు ఒకసారి మార్చి మార్చి కడుతూ ఉంటారు. ఈ విధంగా చేస్తే సీరియల్ చూస్తున్న వారు కూడా గుర్తుపట్టలేరు.
ALSO READ;
ఈ 10 మంది స్టార్ హీరోలు గజిని సినిమాని వదులుకోవడానికి అసలు కారణం ఇదేనా..?