Advertisement
సాధారణంగా ఏ తల్లిదండ్రులైన కూతురు పెళ్లిడుకి వచ్చిందంటే వెంటనే పెళ్లి చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ చాలామంది అమ్మాయిలు చదువు.. పెళ్లి.. రెండింటిలో ఏది ఎంచుకోవాలో తెలియక చాలా సంఘర్షణలు పడుతుంటారు. చదువుకుంటే పెళ్లి ఆలస్యం అవుతుందని ఇంట్లో పెద్దలు ఒత్తిడి చేస్తారు. అయితే పెళ్లి చేసుకుంటే చదువుకు పుల్ స్టాప్ పడుతుందని అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలో తెలియక చాలామంది అమ్మాయిలు సతమతమవుతారు. ఓ నవ వధువుకు ఇలాంటి ఘటనే ఎదురైంది. పెళ్లి.. పరీక్ష.. రెండు ఒకేరోజు రావడంతో ఆ నవవధువు చేసిన చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్లలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది పద్మావతి ( లాస్య). ఆమెకి ఈ నెల 12న కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది. అయితే అదే రోజు రాజు అనే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. దీంతో తనకి కాబోయే భర్తతో పరీక్షకు హాజరు అవుతానని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించిన వరుడు పరీక్ష రాయడానికి అంగీకరించాడు. దీంతో పెళ్లి జరిగిన రెండు గంటలకే వరుడితో కలిసి నవవధువు నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అక్కడ ఆ నవవధువు పరీక్ష రాయడానికి ప్రత్యేక గది కేటాయించాలని వరుడు రాజు కళాశాల ప్రిన్సిపల్ ని కోరాడు. వరుడి విన్నపం మేరకు వధువు పద్మావతి కి ప్రత్యేక గదిని కేటాయించారు.
Advertisement
అందులోనే కెమిస్ట్రీ ఎక్సమ్ కి పెళ్లికూతురు హాజరైంది. చదువుకోవాలన్న తన ఆశను భర్త సహకారంతో పరీక్షా హాలుకు నడిపించిందని నవవధువు తెలిపింది. పెళ్లి చేసుకున్నా చదువులో ఆగిపోకూడదని పసుపు బట్టలతోనే పరీక్షకు హాజరైంది. పెళ్లిరోజు పరీక్ష కావడంతో వధువు అలంకరణలోనే కాలేజీకి వెళ్లి ఔరా అనిపించింది. ఇప్పుడు ఆమె వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నవ వధువు చేసిన పనిని నెటిజెన్లు స్వాగతిస్తూ హాట్సాఫ్ చెబుతున్నారు. పద్మావతి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ముఖ్యమైన అంశాలు !