Advertisement
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా బిగ్గెస్ట్ రియాలిటీ షో “బిగ్ బాస్ సీజన్ 6” వచ్చేసింది. వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ తెలుగులోను టాప్ రేటింగ్ తో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పటివరకు ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ కు సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం స్టార్ మా లో అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్ బాస్.
Advertisement
ఇది ఇలా ఉండగా ఆ షో వచ్చినన్ని రోజులు కచ్చితంగా చూడటం అనేది ఆనవాయితీగా మారిపోయింది. దాంతో ఆ షోకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. మనం రోజు టీవీలో వినే బిగ్ బాస్ వాయిస్ ఓవర్ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఇంటి సభ్యులు ఏం చేయాలనుకున్నా, చేయకూడదన్న అన్ని బిగ్ బాస్ చూసుకుంటాడు. కనిపించకుండా వినిపిస్తుంటాడు ఈయన. రాధాకృష్ణ వాయిస్ ఓవర్ ఈ షోకు బాగా హెల్ప్ అయ్యింది. నిజానికి తెలుగులో బిగ్ బాస్ షో మొదలు పెట్టాలనుకున్నప్పుడు చాలామంది వాయిస్ టెస్ట్ చేశారు. ఎంతోమందిని టెస్ట్ కట్ కూడా చేశారు.
Advertisement
అయితే వాళ్ళు అనుకున్నట్లుగా ఎవరి వాయిస్ కూడా దగ్గర్లో రాలేదు. అలాంటప్పుడు రాధాకృష్ణ వాయిస్ కూడా టెస్ట్ చేశారు. అది పర్ఫెక్ట్ గా సరిపోయింది. అలాగే నిర్వాహకులకు కూడా బాగా నచ్చింది. దాంతో వెంటనే షో నిర్వాహకులు కూడా ఓకే చెప్పారు. రాధా వాయిస్ కు ఫిదా అయిపోయారు. మొదటి సీజన్ నుంచి తాజాగా జరుగుతున్న ఐదో సీజన్ వరకు కూడా ఆయనే చెబుతూ వస్తున్నాడు. మూడో సీజన్ నుంచి తన గొంతును కాస్త మార్చి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు రాధాకృష్ణ. ఈయన అంతకంటే ముందు హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సిఐడి లాంటి సీరియల్స్ కు కూడా డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు బిగ్ బాస్ వాయిస్ తో బాగా ఫేమస్ అయ్యాడు రాధాకృష్ణ. ఏదేమైనా మనిషి కనిపించకపోయినా కూడా తన గొంతుతోనే అందర్నీ మాయ చేస్తున్నాడు రాధాకృష్ణ. బిగ్ బాస్ తెలుగు తర్వాత ఈయనకు బయట కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. సినిమాలు కూడా డబ్బింగ్ చెప్తున్నాడు. రాధాకృష్ణ బిగ్ బాస్ తన కెరీర్ కు చాలా బాగా హెల్ప్ అయిందంటున్నాడు ఈయన.
READ ALSO : “అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!