Advertisement
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో నందమూరి ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కు పరిచయమైన హీరో తారకరత్న. చూడడానికి పొడవుగా, సన్నగా ఉన్న ఈ నందమూరి కుర్రాడిని చూసి స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత తారకరత్న వరుస ప్లాపులతో సతమతమయ్యాడు. నందమూరి కుటుంబం నుంచి ఒక్క విజయం కూడా అందుకొని ఏకైక హీరో తారకరత్న. 20 కి పైగా సినిమాలలో నటించినా కూడా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. జనవరి 27న ఈయన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Advertisement
Read also: హీరో సుమన్ ని ఆ అమ్మాయి తండ్రి కావాలనే కేసులో ఇరికించాడా..? అప్పుడేమైందంటే ?
Advertisement
ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. ఇక ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడంతో చాలామంది ఈయన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తారకరత్న సినీ ఫక్కీలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. 2012 ఆగస్టు రెండున కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి ప్రేమ వివాహం జరిగింది. ఈమె వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కుమార్తె. అప్పట్లో తండ్రి మోహన కృష్ణ తో పాటు మిగతా నందమూరి కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా తారకరత్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమె అంతకుముందే ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డిని వివాహం చేసుకుంది.
అయితే కొన్ని ఏళ్ల తర్వాత మనస్పర్ధలతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె తారకరత్నను వివాహం చేసుకుంది. తారకరత్న, అలేఖ్య రెడ్డి ఇద్దరు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. ఆ తర్వాత ఏడు అడుగుల బంధంతో ఒకటయ్యారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అంతేకాకుండా తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఏది ఏమైనా ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఈయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
Read also: యాదమ రాజు ఎంగేజ్మెంట్.. సిగ్గులేదురా ఆమెను చేసుకున్నావ్ అంటూ ట్రోల్లింగ్