Advertisement
పసిఫిక్ మహాసముద్రం అనేది ప్రపంచంలోని పెద్ద సముద్రం. ఈ సముద్రం 10994 మీటర్ల లోతు ఉంటుంది. ఈ సముద్రం అనేది ఆసియా నుంచి నార్త్ అమెరికా వరకు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల గుండా ఎన్నో ఏరోప్లేన్స్ ప్రయాణం చేస్తాయి. కానీ ఈ విమానాలు పసిఫిక్ మహా సముద్రం పై నుంచి నేరుగా ఎగరవు. కర్వేడ్ మార్గంలో వెళ్తాయి.. అంటే విమానం వెళ్లే మార్గం అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట.. ఇలా వెళ్లడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..ఉదాహరణకు ఏరోప్లేన్ అనేది యూఎస్ఏ నుండి జపాన్ కు స్ట్రెయిట్ గా వెళ్తే కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఏమిటంటే..
Advertisement
ALSO READ: వెంకటేష్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్.. ఇంతమంది ఉన్నారా..?
ఒకవేళ విమానంలో ఫ్యూయల్ సమస్య వచ్చినా, ఇంజన్ ప్రాబ్లం వచ్చిన మహా సముద్రం ప్రాంతంలో వాతావరణ మార్పులు కలిగిన ఆ సమయంలో విమానం ల్యాండ్ అయ్యే ప్రదేశంలో తొందరగా ల్యాండ్ చేయాల్సిందే. కానీ ఈ మహాసముద్రం ప్రాంతంలో ల్యాండింగ్ చేసే ప్రదేశాలు ఉండవు. మొత్తం వాటర్ ఉండటంవల్ల ఏదైనా సమస్య వస్తే నీళ్ళలో పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా పైలెట్ ముందు జాగ్రత్తతో యూఎస్ఏ నుండి కెనడా కి, అలాగే కెనడా నుండి అలస్కాకి,ఇక్కడి నుంచి రష్యా కి ఆ తర్వాత చివరికి జపాన్ వెళ్తారు. ఒకవేళ విమానంలో సమస్యలు ఎదురైతే ఏ దేశంలో అయినా ల్యాండ్ కావచ్చు.
Advertisement
2. అయితే మనం ప్రపంచ పటంలో చూస్తే కర్వేడ్ మార్గం కన్నా స్టేట్ డిస్టెన్స్ షార్ట్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఇది తప్పు.స్ట్రైట్ రూట్ కన్నా కార్వేడ్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక గ్లోబును పరిశీలించండి. ఈ గ్లోబ్ లో లాస్ ఏంజిల్స్ మరియు టోక్యో మధ్య ఒక దారాన్ని ఉంచండి. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది.. స్ట్రైట్ గా చూస్తే ఆ దారం పొడవు ఎక్కువగా ఉంటుంది.. దూరం కూడా పెరుగుతుంది.. అలాగే దానిని కర్వేడ్ షేపులో చూస్తే డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది.. అందుకే విమానాలు సముద్రంపై ప్రయాణం చేసేటప్పుడు నేరుగా వెళ్లకుండా ఈ కర్వేడ్ షేపులో వెళ్తాయి.
ALSO READ: రీల్ లైఫ్ లో కలిసి నటించి రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్న జంటలు..ఎవరంటే..?