Ads
శివుడు.. పరమశివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. సృష్టి, స్థితి కారకులు బ్రహ్మ, విష్ణువులైతే.. అన్నింటినీ తనలో లయం చేసుకునేవాడు శివుడు. ఈ క్రమంలోనే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే మాట ప్రచారంలోకి వచ్చింది. సంస్కృతంలో శివ అనగా సౌమ్యం, శుభం అని అర్థాలు వస్తాయి. సింధు నాగరికత కాలానికి శివుడు లింగం రూపంలోనూ, పశుపతి గాను పూజలు అందుకున్నాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు. ఆ పరమేశ్వరుడు చేతిలో డమరుకం, మెడలో పాముతో పులి చర్మం పైనే కూర్చుంటాడు.
Read also: RAMA BANAM MOVIE HEROINE NAME, AGE, MOVIES, BIOGRAPHY
ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడు. ఇతర దేవుళ్ళు వేసుకున్నట్లు ఆభరణాలు ధరించడు. అయితే ఇవన్నీ కాకుండా శివునికి చెందిన విషయం ఇంకొకటి కూడా ఉంది. శివుడు కేవలం పులిచర్మాన్ని ధరించడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా..? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకానొక సమయంలో శివుడు అరణ్యంలో వెళుతుండగా శివుని తేజస్సును చూసి మహర్షులు, ఋషులు, పండితుల భార్యలు ఆశ్చర్యపోతారు. శివుని సౌందర్యానికి, తేజస్సుకు కళ్ళు తిప్పుకోలేక పోతారు. ఆయన ముఖంలోని వెలుగును చూసి ఆయన పట్ల ఆకర్షితులవుతారట. అనంతరం శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆయననే తలుచుకుంటూ నిత్యం కుటీరాల్లో పనులు కూడా సరిగ్గా చేసేవారు కారట.
Advertisement
అయితే వారు అలా ఎందుకు చేస్తున్నారో వారి వారి భర్తలకు తర్వాత తెలుస్తుంది. దీంతో శివున్ని ఎలాగైనా హతమార్చాలనుకుంటారు. అందుకోసం ఓ కుటిల ఉపాయం కూడా చేస్తారు. మునులు ప్రతిరోజు స్వామి ప్రయాణించే దారిలో ఒక గుంతను తవ్వి మంత్ర శక్తితో పులిని తయారుచేసి శివుడు ఆ గుంత సమీపంలోకి రాగానే ఆ పులిని ఉసిగొల్పుతారు. కానీ సునాయాసంగా శివుడు ఆ పులిని సంహరించి మునుల చర్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకొని పులి చర్మాన్ని కప్పుకున్నాడు. అప్పటినుంచి శివుడు ఆ పులి చర్మాన్ని ధరిస్తూ వస్తున్నాడు. దీని గురించి శివపురాణంలో వివరించబడింది.
Read also: అమ్మాయిలు.. ర్యాపిడో బైక్ పై వెళుతున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే..!!