Advertisement
శఠగోపం అంటే అత్యంత గోప్యమైనదని అర్థం. ఈ శఠగోపం దేవాలయంలోని దేవుడు లేదా దేవత యొక్క ప్రతిరూపం అని భావిస్తారు. గుడికి వెళ్ళినప్పుడు ప్రతి భక్తుడు ఆలయంలో ఉండేటటువంటి దేవున్ని తాక డానికి వీలు ఉండకపోవచ్చు.
Advertisement
అందుకే పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి, తర్వాత శఠగోపాన్ని తీసుకువచ్చి ఆ తలపై పెట్టి ఆశీర్వదిస్తారు. ఇది తలపై పెట్టడం వల్ల వారిలో ఉండేటటువంటి చెడు ఆలోచనలు,మోస బుద్దులు నశిస్తాయని అంటుంటారు. ఈ శఠగోపాన్ని కొంతమంది శట గోప్యం, శడ గోప్యం అని పిలుస్తారు.
Advertisement
భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణం చేసి తీర్థం మరియు శఠగోపం తీసుకుంటూ ఉంటారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది.. దానిపై భగవంతుని పాదాలు గుర్తులు ఉంటాయి. అది మన తలపై పెట్టినప్పుడు ఆ పాదాలు తలను తాకుతాయి.. ఈ విధంగా కాకుండా నేరుగా పాదాలపై మన తలపై పెడితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి, శఠగోపం మన తలకు సెట్ అయ్యేలా వలయాకారంలో తయారుచేసి పైన పాదాలు ఉంచుతారు.
అది మన తలపై పెట్టినప్పుడు మనం కోరుకున్న కోరికలు భగవంతుని పాదాలను తాకుతూ చెప్పుకుంటే నెరవేరుతాయట. శటత్వం అంటే మూర్ఖత్వం..గోపం అంటే దాచిపెట్టడం అని అర్థం వస్తుంది. దేవుడు గోప్యంగా ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదిస్తాడని నమ్ముతారు. అందుకే ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారులు శఠగోపం తలపై పెట్టి మనల్ని దీవిస్తూ ఉంటారు. దీని వల్ల చెడ్డ ఆలోచనలు తొలగి మంచి ఆలోచనలు వస్తాయని అనుకుంటారు.
also read: