Advertisement
ప్రస్తుత కాలంలో మనం తినే ఫుడ్ రీత్యా కాని, వాతావరణంలోని కలుషితం వల్ల కానీ చాలా మంది చిన్నతనంలోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక రోగాలు తెచ్చుకొని మందులతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.
Advertisement
కనీసం వంద సంవత్సరాలు అయిన వారు బతికి ఉండే వారు. మోకాళ్లనొప్పులు అనేవి వారికి ఉండేవికావు. అసలు టాబ్లెట్లు అనే విషయమే వారు ఎరుగరు. కానీ ప్రస్తుత ప్రాశ్చాత్య కాలంలో, ఎన్నో హాస్పిటల్, మెడికల్ షాపులు పడ్డాయంటే కారణం మన రోగాలు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా మనం వైద్యుని సంప్రదించి టాబ్లెట్లు రాయించుకుంటాం.
అయితే డాక్టర్ రాసిన టాబ్లెట్ పై కొన్ని రకాల డిజైన్స్ ఉంటాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం..? టాబ్లెట్ యొక్క క్యాప్సిల్స్ పైన రెడ్ కలర్ లైన్ ని మీరు చూసే ఉంటారు. కానీ దీని అర్థం చాలామందికి తెలియదు. ఈ లైన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విషయంలోకి వెళితే..ఏ టాబ్లెట్ క్యాప్సిల్ పైన ఇలాంటి రెడ్ లైన్ వుంటుందో ఆ టాబ్లెట్స్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకూడదని అర్థం. ఎందుకంటే ఇవి చాలా పవర్ ని కలిగి ఉంటాయి. డాక్టర్ సలహా ఉంటేనే వీటిని కొనుక్కోవాలి.
Advertisement
ఫార్మసీ వాళ్ళు ఒకవేళ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి రెడ్ లైన్ ఉన్న క్యాప్సిల్స్ ను గనుక మీకు ఇస్తే వాటిని తీసుకోకండి. ఒకవేళ తీసుకుంటే కనుక డాక్టర్ ని సంప్రదించి వాటిని వేసుకోండి. మామూలుగా అయితే ఏ ఫార్మసీ లో అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళితే ఇలాంటి మెడిసిన్స్ ని ఇవ్వరు. అలాగే టాబ్లెట్ల పైన లైన్ లను మీరు చూసే ఉంటారు. ఈ లైన్ వల్ల మీకు ఆ టాబ్లెట్ ఫుల్ డోస్ కావాలా లేక ఆఫ్ డోస్ సరిపోతుందా అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మీరు ఒక 500 మిల్లీగ్రాముల టాబ్లెట్ తీసుకున్నారనుకోండి. కానీ మీకు 250 మిల్లీగ్రాముల టాబ్లెట్ మాత్రమే అవసరమైనప్పుడు దాన్ని సగానికి విరిచి వేసుకోవచ్చు.
Also Read: