Advertisement
పెళ్లి… నూరేళ్ళ పంట. పెళ్లి సందడి రాగానే ఇంట్లో హడావిడి మొదలవుతుంది. అలాగే పెళ్లి పనులు నెల రోజులు ముందుగానే మొదలుపెట్టేస్తారు. అయితే… పెళ్లికి వారం రోజులు ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ చేయకూడని పనులు ఏంటివి..? ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం… పెళ్లికి ముందు రోజు రాత్రి పూట తాగడం చేస్తారు. ఆల్కహాల్ సేవించడం వలన చెమట ఎక్కువగా పడుతుంది.
Advertisement
పెళ్లికి కనీసం వారం రోజులు ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. లేదంటే పెళ్లి వేడుకలో ఎక్కువగా చెమట చిరాకు కలుగుతూ ఉంటుంది. పెళ్లికి గడువు దగ్గర పడుతున్న సమయంలో అందంగా కనిపించడం కోసం ఎలాంటి చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకోకూడదు. ఇది సక్సెస్ అయితే చర్మం మృదువుగా మారి బాగానే ఉంటుంది. కాని విఫలం అయితే మాత్రం పెళ్లిలో ముఖం అందవికారంగా కనిపిస్తూ ఉంటుంది.
Advertisement
అలాగే కొత్త కొత్త డ్రీమ్స్ లాంటివి రాక పోవడమే మంచిది. అవి చర్మానికి పడకపోతే అలర్జీ వస్తుంది. అంతే కాకుండా కొత్త కొత్త వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే ప్రయోగాలు చేయడం వల్ల ఏమైనా ఒంటినొప్పులు ఎదురైతే… వాటి తాలూకు ఇబ్బంది మీ ముఖంలో కనిపిస్తుంది. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ పనులు ఎక్కువగానే ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సమయానికి నిద్రపోవాలి. నిద్ర తక్కువైనా ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది.