Advertisement
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే. పెళ్లి చేసుకున్న క్షణం నుండి ఇద్దరు దంపతులు కూడా తమ బంధాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని సాగించాలి. ప్రస్తుతం పెళ్లికి ముందు చాలా మంది తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కాబోయే భర్తతో లేదా భార్యతో చర్చిస్తారు. కానీ పూర్వకాలంలో ఇలాంటివేవి ఉండేవి కావు.
Advertisement
కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య అసలు దాపరికాలు ఉండకూడదని అంటున్నారు. అయితే భర్త అన్ని విషయాలను కూడా భార్యతో పంచుకోకూడదు అంటున్నారు మానసిక నిపుణులు. భర్త కొన్ని విషయాలను భార్యతో పంచుకోవడం వలన లేనిపోని సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. ఈ కాలంలో పెళ్లికుదరగానే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే ఒక్కోసారి ఇది రివర్స్ కూడా అవుతుంది. అయితే పెళ్లికి కాబోయే భార్యతో భర్త పొరపాటున కూడా ఎలాంటి విషయాలను చర్చించకూడదు..? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
* అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లికి ముందుగానీ పెళ్లి తర్వాత కానీ మీ బలహీనతలకు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా జీవిత భాగస్వామితో చర్చించకూడదు. దీనిని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది.
Advertisement
* మీకు ఎక్కడైనా ఏదైనా అవమానం జరిగినట్లయితే ఆ విషయాన్ని భార్యతో పంచుకోకూడదట. ఎందుకంటే భార్యకి ఏదైనా సరే భర్త ఉన్నాడని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది భర్తకే అవమానం జరిగిందని తెలిస్తే వారి నమ్మకం అంతా కరిగిపోతుంది. ఒక విధంగా ఒక రకమైన చిన్న చూపు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
* కొంతమంది అబ్బాయిలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారి జీవితంలో అడుగుపెట్టిన భాగస్వామికి వెంటనే తమ జీవితం గురించి వివరిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీపై గౌరవం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
* ఇక ఇతర వ్యక్తులతో తమ కుటుంబ సభ్యులను పోల్చి చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా పొరపాటున కూడా ఇతర వ్యక్తుల భార్యలతో మీ భార్యని పోల్చి చూడకూడదు. ఇలా చేస్తే మీ బంధం అక్కడితో తెగిపోయే ప్రమాదం ఉంది.
* ఇక భర్త తన బలహీనతల గురించి భార్యతో ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే బలహీనతలు అనేవి మనలోని లోపాలు అనుకునే అవకాశం ఉంది. అర్థం చేసుకునే వారు అయితే పరవాలేదు కానీ లేదంటే దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.
Read also: టాలీవుడ్ భామలు తమ మొదటి సినిమాల్లో ఎలా ఉన్నారో తెలుసా ?