Advertisement
జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో జరగబోయే శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ట ఉత్సవం కోసం యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే.. ఈ వేడుకకు ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంది. అయితే.. ఆ తరువాత రోజు నుంచి ఎవ్వరైనా ఈ మందిరాన్ని దర్శించవచ్చు. అయితే.. అయోధ్యకు వెళ్ళినప్పుడు తప్పకుండ చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే.. అయోధ్యలోని సరయు నదిలో మునకలు వేయడం.
Advertisement
అయోధ్య కధకు సరయు నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీరాముడు అడవికి వెళ్లి వనవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చిన తరువాత ఆయన జీవితాన్ని చూసినది సరయు నదే. వేదాలలో కూడా సరయు నది ప్రస్తావన వస్తుంది. పద్మ పురాణంలో ఈ నది గొప్పదనం గురించి చెప్పబడింది. మహాభారతంలోని భీష్మ పర్వంలో కూడా ఈ నది గొప్పదనం గురించి వస్తుంది. అయోధ్యకు ప్రాధమిక గుర్తింపుగా తులసి దాస్ సరయు నదిని వర్ణిస్తాడు. ఋగ్వేదం లో చెప్పినట్లు సరయు నది ఒక వేదం నది. శ్రీమహా విష్ణువు కన్నీటి బొట్టు నుంచి సరయు నది ఆవిర్భవించింది అని పురాణాలూ చెబుతున్నాయి.
Advertisement
శాంకసరుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో పడేస్తాడు. విష్ణువు మత్స్య అవతారం ధరించి ఆ రాక్షసుడిని చంపి, వేదాలను తీసి బ్రహ్మకి అప్పగిస్తాడు. విష్ణువు కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లను మానస సరోవరంలో ఉంచాలని బ్రహ్మ దేవుడు చెయ్యి పట్టి తీసుకుంటాడు. ఆ కన్నీళ్ల తోనే సరయు నది ఏర్పడిందని వేదాలు చెబుతున్నాయి. హిమాలయాల పాదాల నుంచి ఉద్భవించిన సరయు నది శారదా నదికి ఉపనదిగా మారుతుంది. సరయు నది భూమిపై శ్రీ రాముని బాల్య లీలలను చూడడానికే ఉద్భవించింది అని చెబుతుంటారు.