Advertisement
కేసీఆర్ పై నువ్వా నేనా అన్నట్టు కాలు దువ్వుతుంటారు ఈటల రాజేందర్. పార్టీ నుంచి తననకు బయటకు పంపేశారన్న కసితో ఉన్న ఆయన.. ఓవైపు బీజేపీలో ఎదుగుతూనే.. ఇంకోవైపు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
ఈమధ్య తెలంగాణ వ్యాప్తంగా మెడికో ప్రీతి కేసు సంచలనం రేపింది. ఆమెది హత్యనా? ఆత్మహత్యనా? అనేది ఇప్పటికీ మిస్టరీని. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ నేపథ్యంలో అనేక వార్తలు ప్రచారం లో ఉన్నాయి. కుటుంబసభ్యులు మాత్రం ముమ్మాటికీ హత్యే అని కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అయితే.. ప్రీతి మృతికి సంబంధించి ఈటల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందని.. మనం ప్రోగ్రెసివ్ మేనర్ లో వున్నామా, రిగ్రసివ్ మేనర్ లో వున్నామా అంటూ ప్రశ్నించారు. వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణానికి కారణం వేధింపులేనని అన్నారు. చనిపోయిన బిడ్డకు చికిత్స చేశారంటూ బాంబ్ పేల్చారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీజేఐ, జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు ఈటల. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల్లో వెయ్యి మంది మధ్యలోనే చదవును వదిలేసి వెళ్లిపోతున్నారని, మరో 500 మంది చనిపోతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను వివరించారు.
ఇక మిగిలిన విషయాలపైనా స్పందించిన ఈటల.. అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క ఎస్టీ అధికారి గానీ, ఎస్సీ అధికారి గానీ లేరని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఒక్క దళిత మహిళా ఎమ్మెల్యే కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.