Advertisement
తల్లి ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎవరో చెప్పడం కాదు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో తల్లి ప్రేమ గొప్పతనాన్ని గురించి తెలుసుకునే ఉంటారు. ఆ ప్రేమను ఆస్వాదించేవారు ఉంటారు. అయితే ఇక పిల్లలపై తల్లి చూపించే ప్రేమ ముందు ఇక ఏది సాటి రాదు అనేది ఇప్పటికీ ఎన్నోసార్లు నిరూపితమైంది. తన ప్రాణాలు పోతున్నా కూడా పిల్లల ప్రాణాలు కాపాడాలని తల్లి ఎప్పుడు ప్రయత్నిస్తుంది అని సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఎన్నో ఘటనలు రుజువు చేశాయి.
Advertisement
READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?
శ్రీరామచంద్రుడు వంటి యుగపురుషులు, శివాజీ లాంటి చారిత్రక వీరులు, ఆదిశంకరుల వంటి ధార్మిక వరేన్యులు ఇలా ఎందరెందరో జగద్విఖ్యాతి చెందడానికి ఆదర్శమూర్తులుగా నిలవడానికి అమ్మే మూలం. బిడ్డను కనడానికి తల్లి అంతులేని వేదన అనుభవిస్తుంది. ఆ బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎప్పుడు పరితపిస్తుంది. తన ఆశలమే బిడ్డ ఆశయాలుగా పెంచి పెద్ద చేస్తుంది.
Advertisement
అయితే వందమంది ఆచార్యుల కంటే కన్నతండ్రి గొప్పవాడు. కన్నతల్లి ఎంత శాపానికి ఉంటుంది కానీ కన్నతల్లి కంట కన్నీరు పెట్టించిన దానికి ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదు. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని చీదరించుకున్న తప్పులేదు. కానీ చెడు నడకతో ఉన్న తల్లిని నిరాదరించిన తప్పే అని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లిని మించిన దైవం లేదని మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం. లక్ష గోవులు దానం ఇచ్చిన, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన కన్నతల్లిని కష్టపెట్టిన పాపం నివృత్తి కాదట. కాబట్టి కన్నతల్లిని సంతోషంగా ఉండేలా చూసుకోండి.
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?