Advertisement
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. బ్రాడ్ క్రికెట్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను సృష్టించి తనకంటూ ఓ రికార్డును నమోదు చేసుకున్నాడు. ముఖ్యంగా 2006లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన స్టువర్ట్ బ్రాడ్, 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ అండర్సన్ తో కలిసి దశాబ్దానికి పైగా బంతి పంచుకున్నాడు. తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించాడు. స్టువర్ట్ బ్రాడ్.. అండర్సన్ ఇద్దరూ కలిసి 1002 వికెట్లను తీయడం రికార్డు అనే చెప్పాలి.
Advertisement
ఇంగ్లండ్ తరుపున 121 వన్డేలు, 56 టీ 20 మ్యాచ్ లు ఆడిన స్టువర్ట్ బ్రాడ్ గత కొద్ది సంవత్సరాలుగా టెస్ట్ లకు మాత్రమే పరిమితమయ్యాడు. 165 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన స్టువర్ట్ బ్రాడ్.. ప్రస్తుతం యాషెస్ సిరీస్ 2023 టోర్నీలో పాల్గొంటున్నాడు. 5 టెస్టుల్లో 20 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాండ్.. ఇంగ్లండ్ తరపున టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో ఉన్న బ్రాడ్ కి ఇదే చివరి ఇన్నింగ్. 2007 టీ 20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్ లో 6 సిక్సులు బాది ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఓవర్ బౌలింగ్ చేసింది స్టువర్ట్ బ్రాడ్ కావడం విశేషం.
Advertisement
2010 టీ 20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడు. ఇంగ్లాండ్ తరపున అత్యధిక టెస్టులు ఆడిన రెండో క్రికెటర్ గా ఉన్నాడు. 182 మ్యాచ్ లు ఆడిన జేమ్స్ అండర్సన్ అత్యధిక టెస్టులు ఆడగా.. స్టువర్ట్ బ్రాడ్ 166 టెస్టులు ఆడాడు. 689 వికెట్లతో అండర్సన్ అత్యధిక వికెట్లు తీయగా.. 600 వికెట్లు పూర్తి చేసుకున్న స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో పాటు 3640 పరుగులు చేశాడు స్టువర్ట్ బ్రాడ్. పాకిస్తాన్ పై టెస్టుల్లో 169 పరుగులు చేయడం విశేషం. మరోవైపు డేవిడ్ వార్నర్ ని 17 సార్లు అవుట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ ప్లేయర్ ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేసాడు.