Advertisement
సాధారణంగా ఐ బొమ్మగురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి కాదు.. థియేటర్లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఏమి తినకుండా కేవలం సినిమా మాత్రమే చూసి వస్తే.. రూ.1000 రూపాయలకు పైగా ఖర్చు అవుతాయి. అయితే మధ్య తరగతి వర్గంఅంతా ఐ బొమ్మను ఆశ్రయిస్తోంది. ఓటీటీలోకి వచ్చిన ప్రతీ తెలుగు సినిమా కొన్ని గంటల్లోనే ఐ బొమ్మలోకి వచ్చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ లైట్ గానే తీసుకుంది.
Advertisement
ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మ ట్రెండ్ మార్చింది. థియేటర్ లో విడుదలైన సినిమాలను సైతం ఐబొమ్మలో పెట్టేస్తోంది. ఇది సినీ ఇండస్ట్రీకి కాస్త మండింది. దీంతో ఈ వెబ్ సైట్ మీద టాలీవుడ్ ఫోకస్ పెట్టింది. దీంతో తమను టార్గెట్ చేస్తారా..? అంటూ ఐ బొమ్మ ఫైర్ అయిపోయి ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చేసింది. తమపై ఫోకస్ పెడితే.. తాము కూడా ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటూ వార్నింగ్ కూడా ఇచ్చిందట. హీరోలు, హీరోయిన్లకు అంత రెమ్యునరేషన్ అవసరమా ? అని ప్రశ్నించింది.
Advertisement
లైట్ బాయ్స్, సెట్ బాయ్స్ కూలి పెంచితే వారి కుటుంబాలు బాగుపడుతాయని ఐ బొమ్మ వెల్లడించింది. అయితే ఇలా ఐ బొమ్మ ఫైర్ అయినప్పటికి కూడా ఇండస్ట్రీ రెస్పాన్స్ కాకపోవడం కాస్త ఆకస్తిని కలిగిస్తోంది. తమిళ ఇండస్ట్రీని ఇలాగే ఇబ్బంది పెట్టిన తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్ పై కోలీవుడ్ ఫోకస్ చేసింది. ఆ వెబ్ సైట్ వాళ్లను పట్టుకొని తమిళ్ రాకర్స్ కి చెక్ పెట్టేసింది. మరీ ఐ బొమ్మ విషయంలో టాలీవుడ్ ఇలాగే స్పందిస్తుందా ? లేదంటే.. లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి మరీ.