Advertisement
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టు షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. వాస్తవానికి ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉన్న విభేదాల కారణంగా డిసెంబర్ 6 కు నిర్మాతలు వాయిదా వేశారు. ఆ సమయంలో విడుదల చేసి ఉంటే నష్టం జరుగుతుందనే భావనలో నిర్మాతలు ఉన్నారు. జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనులు రేపుతోంది.
Advertisement
గోవాలో ఉన్న జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ కి జానీకీ సయోధ్య కుదర్చడానికి ఓ స్టార్ హీరో ప్రయత్నం చేశారు. అది కుదరలేదు. తాజాగా ఇంకో విషయం బయటకు వచ్చింది సుకుమార్ కూడా జానీ ని బాధితురాలని పిలిచి మాట్లాడారని రాజీ కుదర్శాలని ప్రయత్నించారని.. జానీ మాస్టర్ సతీమణి సుమలత వెల్లడించారు.
Advertisement
Also read:
పుష్ప టు మూవీ షూటింగ్ సమయంలో సెట్ లో జానీకి తన అసిస్టెంట్ కి గొడవ జరిగినట్లు సమాచారం. పుష్ప టు కోసం ఆమె ఓ పాటకు కంపోజ్ చేస్తుండగా జానీ సెట్ కి వెళ్లి గొడవ చేశారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. సుకుమార్ సర్దు చెప్పినాడానికి ప్రయత్నం చేశారు గొడవ సర్దుకుంది. ఆ సమయంలో సెట్ లో తాను కూడా ఉన్నానని గొడవేది జరగలేదని సుమలత అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!