Advertisement
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి కంటే పదేళ్ల ముందే దర్శకుడుగా తన విజన్ ఏంటో చూపించాడు శంకర్. ఈయన తీసింది కొన్ని సినిమాలే అయినా ఇండియాలోనే ది మోస్ట్ క్రేజీయస్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సామాజిక సమస్యలే శంకర్ సినిమాకులకు ప్రధాన కథా వస్తువులు. సామాజిక సమస్యలకు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. సౌత్ లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నాడు.
Advertisement
Read also: తన కంటే పెద్ద వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న సచిన్ లవ్ స్టోరీ ట్విస్టులు మాములుగా లేవు !
ఒకేసారి రెండు సినిమాలు చేయడం శంకర్ కు ఇదే తొలిసారి. అందులో ఒకటి గతంలో వచ్చిన కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాకి సీక్వెల్ కాగా.. మరొకటి రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా ” గేమ్ చేంజర్” అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 1963 లో పుట్టిన శంకర్ సినిమా ఇండస్ట్రీకి నటుడు అవ్వాలని వచ్చారు. కానీ చాలా ఏళ్ల తర్వాత ఇక నటన తన వల్ల కాదని అర్థం అయ్యాక ఎస్ఏ చంద్రశేఖర్ మరియు పవిత్రన్ వంటి వారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాడు. అలా మూడేళ్ల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ తో జెంటిల్ మెన్ అనే సినిమా తీయగా.. ఆ చిత్రం తమిళ్ లోనే కాదు సౌత్ ఇండియాలో అతిపెద్ద విజయం సాధించింది. దీంతో ఇక శంకర్ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Advertisement
అయితే శంకర్ దర్శకుడిగా మారడానికి ముందు నటించిన కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1985లో మొట్టమొదటిసారి ‘మేషం’ అనే సినిమాలో శంకర్ కెమెరా ముందు కనిపించాడు. ఆ తరువాత 1986లో వసంతరాగం, పూవుమ్ పూయలం అనే చిత్రాలలో కనిపించాడు కానీ ఒక్క డైలాగ్ కూడా పడలేదు. ఇక 1994లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇక ఇదే చిత్రం తెలుగులో భారతీయుడు పేరుతో విడుదలై ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఇక దీని తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన శివాజీ, కాదల్ వైరస్, రోబో, త్రీ ఇడియట్స్ సినిమాలలో స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించారు.