Advertisement
ఒకప్పుడు వెండి తెరపై ఒక ఊపు ఊపి, కొద్ది కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్స్ మన మధ్య ఇప్పుడు లేరంటే చాలా బాధగానే ఉంటుంది. ఈ నటులు అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మరి చిన్నవయసులోనే ప్రాణాలు విడిచిన ఈ స్టార్ హీరోయిన్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..
Advertisement
Also Read: దైవ దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడపాలి అంటారు, ఎందుకు?
సావిత్రి:
మహానటి సావిత్రి అంటే ఆనాటి కాలంలో హీరోలతో సమానంగా పోటీపడి నటించేది. ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూశారు అంటే ఈ హీరోయిన్ క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి అనారోగ్యం కారణంతో 46 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది.
దివ్యభారతి :
Also Read: ఫిదా మూవీలో ఈ చిన్న మిస్టేక్ గమనించారా.. లాజిక్ ఎలా మిస్సయ్యారు శేఖర్ కమ్ముల సార్..!!
చిన్న వయసులోనే తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలకృష్ణ,వెంకటేష్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ తరుణంలోనే 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పదంగా మృతి చెందింది.
సౌందర్య:
Advertisement
ఎంతో అందం నటనా చాతుర్యంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా పోటీ పడి నటించింది. ఈమె డేట్స్ కోసం కూడా హీరోలు దర్శకనిర్మాతలు వెయిట్ చేసే వారు అంటే ఈమె క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందకు పైగా చిత్రాల్లో నటించి 33 ఏళ్ల వయసులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.
ఆర్తి అగర్వాల్ :
నువ్వు నాకు నచ్చావ్ సినిమా తో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆర్తిఅగర్వాల్. ఈమె 31 ఏళ్ల వయసులోనే సర్జరీ వికటించి మరణించింది.
సిల్క్ స్మిత :
తెలుగు అభిమానులను అందచందాలతో నిద్రపట్టకుండా చేసి, వచ్చిన కొద్ది కాలంలోనే ఎంతో క్రేజ్ సంపాదించింది. సిల్క్ స్మిత సినిమాలో ఉందంటే ఆ మూవీ తప్పనిసరిగా హిట్ అయ్యేది. ఆమె ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. నిర్మాతగా చేసి నష్టాల పాలై, చివరికి ఆర్థిక ఇబ్బందులతో 35 ఏళ్ల వయసులోనే మరణించింది.
ALSO READ;
పుష్ప మూవీలో ఈ చిన్న మిస్టేక్ గమనించారా.. ఎలా మిస్సయ్యారబ్బా..!!