Advertisement
ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం, తులసి మొక్క దగ్గర శుభ్రం చేయడం చాలా ముఖ్యమైనవి. తులసి మొక్క కి పూజ చేసేటప్పుడు, కొన్ని పనులు తప్పకుండా చేయాలి. మరి ఇక ఎటువంటి పనులు చేయాలి అనేది చూసేద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి తో దీపాన్ని పెట్టాలి ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు.
Advertisement
Advertisement
ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి కలుగుతుంది. పిండితో దీపాన్ని పెడితే కూడా మంచిది. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు కనబడతాయి. లక్ష్మీదేవి అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక బాధల నుండి బయట పడొచ్చు. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తులసి మొక్క కి పూజ చేస్తే మంచిది. ధనానికి లోటు కలగకుండా ఉండాలంటే ఆదివారం ఏకాదశి రోజున తులసి మొక్కకి నీళ్లు పోయకూడదు. ఆ రోజుల్లో తులసి మొక్కలని తొలగించకూడదు పైగా తులసి ఆకులని తెంపకూడదు.
Also read: