Advertisement
క్రిప్టోకరెన్సీ కేసు దర్యాప్తులో లంచం తీసుకునే ఆరోపణలపై సీఈఎన్ ఇన్ స్పెక్టర్ సహా నలుగురు కర్ణాటక పోలీస్ అధికారులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. CEN పోలీస్ ఇన్ స్పెక్టర్ శివప్రకాశ్, అతని ముగ్గురు సహచరులను కలమసేరి పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. కర్ణాటకలో నమోదు అయిన ఓ చీటింగ్ కేసులో అనుమానితులను అరెస్టు చేయడం కోసం కొచ్చికి వెళ్లారు కర్ణాటక పోలీసులు.
Advertisement
వారిని అక్కడ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇన్ స్పెక్టర్ తో సహా నలుగు కర్ణాటక పోలీస్ సిబ్బందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? కేరళకు వచ్చిన కర్ణాటక పోలీసులు ఇద్దరూ నిందితులను పట్టుకున్న తరువాత వారిని విడిపించడానికి డబ్బు డిమాండ్ చేసినట్టు ఆరోపనలు వచ్చాయి. దీంతో వారిని అరెస్టు చేసారు. బెంగళూరుకు చెందిన చందక శ్రీకాంత్ అనే సాప్ట్ వేర్ ఇంజినీర్ మోసానికి పాల్పడినట్టు కేసు నమోదు చేశారు పోలీసులు. కర్ణాటకలో ఆన్ లైన్ క్రిప్టో కరెన్సీ చీటింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పలువురు అనుమానితులు కేరళలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.
Advertisement
ఈ నేపథ్యంలో ఆగస్టు01న కర్ణాటక పోలీసు సిబ్బంది కొచ్చికీ చేరుకున్నారు. క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి ఇద్దరూ అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచిపెట్టేందుకు రూ.25లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ తరుణంలో పట్టుబడిన నిందితులలో ఒకరు లక్ష, మరో నిందితుడు రూ.2.95 లక్షల డబ్బును కర్ణాటక పోలీసులకు ఇచ్చారు. డబ్బులు చెల్లించినప్పటికీ వారిని విడుదల చేసేందుకు నిరాకరించారు పోలీసులు. దీంతో ఆ యువకుల కుటుంబీకులు కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఈ తరుణంలోనే కర్ణాటక పోలీసులను అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. వారి వద్ద నుంచి రూ.3.95 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.