Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు స్కీములని తీసుకువచ్చారు తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 7న తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సీఎం బాధ్యతలు తీసుకుని ఆయన ఏకంగా 6 గ్యారంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ట్రాన్స్టెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి.
Advertisement
ఆరోగ్యశ్రీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి 10 లక్షల వరకు చేయూత పథకాన్ని ప్రారంభించారు ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి విపరీతమైన ఆధరణ అయితే వచ్చింది. మహిళలు సంతోషంలో ఉన్నారు. ఫ్రీ బస్సు సౌకర్యం వలన ఆర్టీసీ ఆదాయం పెరిగింది. అదేంటి ఫ్రీగా వెళ్తే ఆర్టీసీ ఆదాయం తగ్గాలి కదా..? పెరిగింది ఏంటని చాలామంది అనుకుంటున్నారు మహాలక్ష్మి పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణకి సంబంధించిన మహిళలు ఏదైనా ఒక ఐడి కచ్చితంగా ప్రయాణం చేసేటప్పుడు చూపించాలి. ఒకవేళ కనుక ఐడి లేకపోతే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాలి.
Advertisement
అలా చేయకపోతే 500 రూపాయలు కట్టాలి అయితే సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో 13 లక్షల మేర ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. దాదాపు 90% మంది మహిళలే ఉంటున్నారు గతంలో 13 లక్షల నుండి 14 లక్షల వరకు ఆదాయం వచ్చింది ఇప్పుడు చూసుకున్నట్లయితే 18 నుండి 25 లక్షలు వరకు అది పెరిగిందట ఇలా లాభాలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ పథకం మొదలైనప్పటి నుండి రోజు 40 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ జీరో టికెట్ ద్వారా ప్రభుత్వానికి లెక్కలు చెప్తే వాళ్ళు దాని ఆధారంగా రీయంబర్స్ పే చేస్తూ ఉంటారు సో ఇలా ఆర్టీసీకి ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!